Monday, December 23, 2024

నాపై కేసు కొట్టివేయండి: హైకోర్టులో డింపుల్ హయాతి పిటిషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో నటి డింపుల్ హయాతి పిటిషన్ దాఖలు చేశారు. ట్రాఫిక్ డిసిపి ఒత్తిడితో తనపై తప్పుడు కేసు బనాయించారని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. డింపుల్ హయాతికి సిఆర్‌పిసి 41ఎ కింద నోటీసు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం సిఆర్‌పిసి 41ఎ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది.

కాగా, ఐపిఎస్ అధికారి, ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే కారుపై దాడి చేశారన్న కారణంతో ఆయన డ్రైవర్ చేతన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News