Thursday, January 23, 2025

ఆ కక్షతోనే డింపుల్ పై తప్పుడు కేసులు: న్యాయవాది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డేతో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ వివాదంపై ఆమె న్యాయవాది స్పందించారు. ”డిసిపి జంతువులను హింసిస్తుంటే డింపుల్ వారించింది. ఆ కక్షతోనే డింపుల్ పై తప్పుడు కేసులు పెట్టారు. డింపుల్ ఎక్కడ కూడా డిసిపి కారును తన్నిన ఫుటేజ్ లేదు.డింపుల్ పట్ల డిసిపి అసభ్యంగా ప్రవర్తించారు. డిసిపి ప్రవర్తనతో డింపుల్ మానసిక ఒత్తిడికి గురైంది. బయటకు వెళ్లేందుకు కూడా డింపుల్ భయపడుతోంది. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం” అని పేర్కొన్నారు.

జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్ క్లేవ్ సెల్లార్ లో ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టి ధ్వంసం చేసినట్లు డిసిపి డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. డింపుల్ హయతిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇదిలావుంటే, ఒక వారంలోనే డింపుల్ కారుపై రూ.3,400 చలాన్లు వేశారు. ఈ ఘటనపై డింపుల్ స్పందిస్తూ..తాను భయపడేది లేదని, ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని పేర్కొంది. అధికార బలంతో తప్పును కప్పిపుచ్చలేరని డింపుల్ వరుస ట్వీట్స్ చేసింది. కాగా, ఇటీవల విడుదలైన మ్యాచో హీరో గోపిచంద్ ‘రామబాణం’ సినిమాతో రవితేజ ‘ఖిలాడి’ మూవీలో డింపుల్ హయతి హీరోయన్ నటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News