Sunday, December 22, 2024

2,80,000 ఓట్ల మార్జిన్‌తో గెలిచిన డింపుల్ యాదవ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట కోసం జరిగిన పోరులో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ అద్భుతమైన విజయాన్ని నమోదుచేశారు. అక్టోబర్‌లో అఖిలేశ్ తండ్రి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. అఖిలేశ్ పిన్నాన శివపాల్ యాదవ్‌కు సన్నిహితుడైన బిజెపికి చెందిన రఘురాజ్ సింగ్ షాక్యాపై ఆమె విజయం సాధించారు. ఆమె 280000 ఓట్ల మార్జిన్‌తో గెలిచారు. గెలిచాక అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘నేతాజీ’గా పేరుగాంచిన ములాయం సింగ్ యాదవ్ 2019లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. నాడు ఆయన 94000 మార్జిన్‌తో గెలిచారు.

మైన్‌పురికి సోమవారం ఎన్నికలు జరిగాయి. దాంతోపాటు రామ్‌పుర్, ఖతౌలి అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికలు జరిగాయి. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు బిజెపి, సమాజ్‌వాదీ పార్టీ ఒకదాన్ని మరొకటి తీవ్రంగా నిందించుకున్నాయి. అధికార పార్టీ చెప్పుచేతల ప్రకారం రక్షక బలగాలు నడుచుకుంటున్నాయని అఖిలేశ్ యాదవ్ నిందించగా, సమాజ్‌వాదీ పార్టీ దౌష్టానికి పాల్పడుతోందని బిజెపి నిందించింది. ఇరు పార్టీల నాయకులు ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ‘డింపుల్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ రికార్డును కూడా బ్రేక్ చేసి గెలుస్తుంది’ అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. ఆ విషయాన్ని ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. ములాయం సింగ్ యాదవ్ తన 82వ ఏట అనారోగ్య కారణంగా కన్నుమూశారు. అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ తమ మధ్య విభేదాలను పక్కనబెట్టి డింపుల్ యాదవ్ కోసం కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార సమయంలో శివపాల్ యాదవ్ “ఒకవేళ బిజెపి అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాఖ్య నన్ను గురువుగా భావిస్తే, ఓ మంచి శిష్యుడిగా అతడు నా కోడలు మీద పోటీ చేసి ఉండాల్సింది కాదు. రఘురాజ్ సింగ్ నన్ను చీకట్లో ఉంచి మోసగించాడు” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News