Tuesday, February 4, 2025

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక ప్లేయర్..

- Advertisement -
- Advertisement -

శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే(36) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈనెల 6 నుంచి ఆస్ట్రేలియాతో గాలెలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు కరుణరత్నే ప్రకటించారు. గాలే టెస్ట్.. కరుణరత్నేకు 100వ మ్యాచ్ కానుంది. తన కెరీర్ లో కరుణరత్నే.. 99 టెస్టుల్లో 7,172 పరుగులు, 50 వన్డేల్లో 1,316 పరుగులు చేశారు.

టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు చేశాడు. ఓపెనర్‌గా రాణించిన కరుణరత్నే… 30 టెస్టులకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఇటీవల ఫామ్ కోల్పోవడంతో రిటైర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. చివరి ఏడు టెస్ట్ మ్యాచ్‌లలో కరుణరత్నే కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. సెప్టెంబర్ 2024లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ లో ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News