Wednesday, January 22, 2025

శ్రీలంకకు భారీ ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

కొలంబో: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక టీమ్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లంకకు ఇప్పటికే 212 పరుగుల ఆధిక్యం లభించింది. సీనియర్ ఆటగాళ్లు ఎంజిలో మాథ్యూస్, దినేష్ చండీమల్‌లు శతకాలతో లంకను ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూస్ 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 141 పరుగులు చేసి హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దినేష్ చండీమల్ 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 107 పరుగులు సాధించాడు. ఓపెనర్ దిముత్ కరుణరత్నె 77 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News