Monday, April 7, 2025

టీమిండియాకు ఆ ఇద్దరితోనే ముప్పు: దినేశ్ కార్తీక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడుతున్నాయి. కివీస్ జట్టు స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తుండడంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సలహాలు ఇచ్చాడు. న్యూజిలాండ్ జట్టులో మిచెల్ శాంట్నార్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై శాంట్నార్ చెలరేగుతాడని హెచ్చరించాడు. కేన్ విలియమ్సన్‌ను త్వరగా ఔట్ చేస్తే భారత్ గెలిచినట్టేనని చెప్పాడు. ఈ ఇద్దరుతోనే టీమిండియాకు ముప్పు  ఉందన్నారు.

దుబాయ్ పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కు అనుకూలిస్తాయని, శాంట్నార్ తన స్పిన్ మాయతో టీమిండియా బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడని ఆయన హెచ్చరించాడు. శాంట్నార్ మంచి కెప్టెన్ కావడంతోపాటు లాథమ్ లాంటి ఆటగాళ్లపై ఎక్కువ నమ్మకం ఉంచాడని తెలియజేశారు. ఛాంపియన్ ట్రోఫీలో ఉత్తమ జట్టు భారతేనని, అత్యుత్తమ జట్టు న్యూజిలాండ్‌పై గెలువాలని ఆకాంక్షించారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే మ్యాచ్‌లలో కివీస్ గెలుపు ఎక్కువగా ఉందని డికె పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో కివీస్‌ను భారత్ ఓడించడం కలిసి వచ్చే అంశం అని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News