ముంబై : ఐపిఎల్ 2022 సీజన్‌లో మంచి ఫామ్‌తో రాణించిన దినేశ్ కార్తీక్ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచ క్రికెట్‌లో మారుమ్రోగుతోంది. 37 ఏళ్ల వయసులో దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపిఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు కార్తీక్. 2004 సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌పై వన్డేల్లో, నవంబర్‌లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన దినేశ్ కార్తీక్. టీమిండియా ఆడిన మొట్ట మొదటి టి20 జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. అనతంతరం 2006లో డిసెంబర్ 1న జోహన్స్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో కలిసి మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడిందింది టీమిండియా. కాగా, ఆ జట్టు తరుపున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి ఓపెనింగ్ చేశారు. సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో ఆడిన ఏకైక అంతర్జాతీయ టి20 మ్యాచ్ కూడా ఇదే. 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సచిన్. వీరేంద్ర సెహ్వాగ్ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయగా దినేశ్ మోంగియా 45 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోనీ డకౌట్ అయ్యాడు.
దీనేశ్ కార్తీక్ ఎంట్రీ..
71 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 28 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 31 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. టీమిండియా ఆడిన మొట్టమొదటి టి20 మ్యాచ్‌లో ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా దినేశ్ దక్కించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాల్గొన్న ఇరుజట్లలోని 22 మందిలో దినేశ్ కార్తీక్ ఒక్కడే ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతుండడం విశేషం. భారత జట్టులోని సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, దినేశ్ మోంగియా, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, శ్రీశాంత్. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేసిన విషయం తెలిసిందే.
18 ఏళ్ల కెరీర్..
18 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూ వస్తున్న దినేశ్ కార్తీక్, టీమిండియా తరుఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టి20 మ్యాచులు మాత్రమే ఆడడం కొసమెరుపు. సౌతాఫ్రికాతో జరిగిన మొట్టమొదటి టి20 మ్యాచ్‌లో టి20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, 16 ఏళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికాతో సిరీస్ ద్వారానే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో ఆర్‌సిబి తరఫున భీకర ఫామ్‌తో రాణిస్తున్న దినేశ్ ఈ సిరీస్ అదే మాదిరిగా రాణిస్తాడనే అంచనాలు అటు జట్టు మెనేజ్‌మెంట్‌లోను.. ఇటు అభిమానుల్లోనూ నెలకొంది.
కార్తీక్ పై భారీ అంచనాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -