బెంగళూరు: ఐపిఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్షంగా పెట్టుకున్నామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. కిందటి సీజన్‌లో బెంగళూరు టీమ్‌లో ఆటగాడిగా కొనసాగిన కార్తీక్ ఈసారి కోచ్ అవతారమెత్తాడు. ఈ క్రమంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించాడు. ఐపిఎల్ ఆరంభం నుంచి ఆడుతున్నా తమకు ట్రోఫీ అందని ద్రాక్షగానే ఉందన్నాడు. ఈసారి ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నట్టు వివరించాడు. దీని కోసం సమష్ఠిగా ముందుకు సాగుతామన్నాడు. ఆటగాడిగా పోల్చితే కోచ్ పదవి చాలా క్లిష్టమైందన్నాడు. అయితే తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చాడు. క్రికెటర్‌గా ఉంటే జట్టులో సేవ చేసేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉంటారు. కానీ కోచ్‌గా బాధ్యతలను నిర్వర్తించేటప్పుడూ ప్రతిది తామే చేయాల్సి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కోచ్ పదవి సెల్ఫ్ సర్వీస్ లాంటిది. ఇక్కడ మన బాధ్యత మనమే నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తాను కూడా కోచ్ పదవిని చేపట్టా. దీని చాఆ కీలకమైన బాధ్యత. మెగా వేలం తర్వాత బెంగళూరు టీమ్‌పై పూర్తి దృష్టి సారించా. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు కూర్పు ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది. ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌లో ప్రతి జట్టు బలమైనదే. అన్ని జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇలాంటి స్థితిలో జట్టును గెలుపు బాటలో నడిపించడం చాలా కష్టంతో కూడుకున్న అంశం. అయితే విరాట్ కోహ్లిలాంటి సీనియర్ ఆటగాడు జట్టులో ఉండడం తమకు సానుకూల పరిణామం. యువ కెప్టెన్ రజత్ పటిదార్‌లో అపార నాయకత్వ ప్రతిభ దాగివుంది. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే టోర్నమెంట్‌లో మెరుగైన చేయడం కష్టమేమీ కాదు. ఈసారి ఐపిఎల్‌లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అన్ని జట్లు కూడా ట్రోఫీపై కన్నేశాయి. ప్రతి జట్టులోనూ అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. స్వదేశీ, విదేశీ క్రికెటర్ల కలయికతో అన్ని జట్లు బలోపేతంగా మారాయి. దీనికి తోడు అన్ని జట్లలోనూ సీనియర్ కోచ్‌లు ఉన్నారు. దీంతో పోటీ నువ్వానేనా అన్నట్టు సాగడం తథ్యం. తాము మాత్రం కలిసికట్టుగా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేస్తామని కార్తీక్ పేర్కొన్నాడు.
బెంగళూర్ ప్రధాన కోచ్ దినేశ్ కార్తీక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -