Thursday, January 23, 2025

ఇడి అదనపు డైరెక్టర్‌గా దినేష్ పరుచూరి

- Advertisement -
- Advertisement -

Dinesh Paruchuri as Additional Director of ED

హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)హైదరాబాద్ అదనపు డైరెక్టర్‌గా ఐఆర్‌ఎస్ అధికారి దినేష్ పరుచూరి నియమితులయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధితో కూడిన ఇడి డైరెక్టరేట్ హైదరాబాద్ జోన్‌కు దినేష్ పరుచూరి నేతృత్వం వహించనున్నారు. ఈక్రమం లో ఐఆర్‌ఎస్ 2009 బ్యాచ్ అధికారి అయిన దినేష్ పరుచూరి ఈ ఏడాది జూలై 31న డిప్యూటేషన్‌న్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో చేరారు. ఇదివరలో దినేష్‌పరుచూరి ఆదాయపన్ను శాఖ, ఆంధ్రప్రదేశ్ ట్రాస్స్‌కో విభాల లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుత జాయిట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ముంబై రెండో జోన్ జెడిగా బదిలీతో ఆయన స్థానంలో దినేష్‌ను నియమించారు. కాగా ముంబై రెండో జోన్ జెడిగా బదిలీ అయిన అభిషేక్ గోయల్ పనాజీ, రాయ్‌పూర్ జోన్లకూ ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News