Thursday, January 23, 2025

కార్తీక్, సూర్యకుమార్ ఔట్… 95/5

- Advertisement -
- Advertisement -

Dinesh Karthik

ఇండోర్: హోల్కర్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టి20లో 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 95 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ ఒక పరుగు చేసి పార్నెల్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. రిషబ్ పంత్ 14 బంతుల్లో 27 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్ లో స్టబ్స్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దినేష్ కార్తీక్ 21 బంతుల్లో 46 పరుగులు చేసి మహారాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 6 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసి ప్రీటిరియిస్ బౌలింగ్ స్టబ్స్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర పటేల్(02), హర్షల్ పటేల్ (04) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News