Wednesday, January 22, 2025

ఇంజనీరింగ్ విద్యార్ధుల కోసం డైనింగ్ బ్లాక్: ఓయూ విసి రవీందర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులకోసం నిర్మించిన డైనింగ్ బ్లాక్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ ప్రారంభించారు. 4వేల 596 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన ఈ భవనంలో ఒకేసారి 237 మంది విద్యార్థులు కూర్చుని భోజనం చేసే విధంగా రూ. 39.5 కోట్ల వ్యయంతో 500 మంది విద్యార్థులకు సరిపోయే హాస్టల్ భవన నిర్మాణం కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

మూడు అంతస్థుల్లో 1.59 ఎకరాల్లో133 గదులతో ఈ హాస్టల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హాస్టళ్ల నిర్మాణం పూర్తి అయి-తే మరో 20 ఏళ్ల వరకు విద్యార్థుల వసతికి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య పి.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ బి. రెడ్యానాయక్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తో పాటు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి. చంద్రశేఖర్, ప్రొఫెసర్ మంగు, ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహాల వార్డన్లు ఆయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News