Saturday, November 16, 2024

అభివృద్ధి గురించి చెప్పండి… నాతో డిన్నర్ చేయండి..

- Advertisement -
- Advertisement -

కేజ్రీవాల్ వినూత్న ప్రచారం

న్యూఢిల్లీ : వచ్చే నెలలో జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమౌతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వినూత్నంగా ఎన్నికల ప్రచారానికి తెరతీసింది. తమ ప్రభుత్వం చేసిన మంచి పని గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని దేశ రాజధాని ప్రజలకు సిఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వీడియోలు బాగా వైరల్ అయిన ఏభై మంది ఢిల్లీ వాసులను ఎన్నికల తరువాత విందుకు ఆహ్వానిస్తానని ఆయన తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం “ఏక్ మౌకా కేజ్రీవాల్ కో ” ( కేజ్రీవాల్‌కి అవకాశం ఇవ్వండి ) అనే నినాదంతో డిజిటల్ ప్రచారాన్ని అరవింద కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై వీడియోలు అప్‌లోడ్ చేయండి. వాటి నుంచి ఎలా ప్రయోజనం పొందారో అన్నది మీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా ప్రజలకు చెప్పండి. అలాగే ఈ రాష్ట్రాల్లో మీకు తెలిసిన వ్యక్తులను కేజ్రీవాల్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయండి” అని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News