Monday, December 23, 2024

‘ఏజెంట్’ లార్జ్ యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్, ట్విస్ట్స్ : డినో మోరియా

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఏజెంట్ లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఏజెంట్’ లో మీ పాత్ర గురించి చెప్పండి ?

ఇందులో నేను ‘రా’ ఏజెంట్ పాత్ర పోషించాను. అయితే వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థ కు ఎదురుతిగి, వ్యవస్థపై పగ తీర్చుకునే పాత్ర ఇది. తను ప్రత్యేక శిక్షణ తీసుకున్న పవర్ ఫుల్ ఏజెంట్. కానీ తనకు జరిగిన ద్రోహం కారణంగా ఈవిల్ గా మారిపోతాడు. తనలో చాలా మ్యాడ్ నెస్ వుంటుంది. సురేందర్ రెడ్డి గారు ఈ పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నా పాత్రలో చాలా ఎమోషన్, డ్రామా వుంటుంది.

ఏజెంట్ కథ విన్నప్పుడు ఎలా అనిపించింది ?
ఏజెంట్ కథ విన్నప్పుడే చాలా నచ్చేసింది. తెలుగులోకి రావడానికి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అని నిర్ణయించుకున్నాను. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇది ముగ్గురు ఏజెంట్స్ కథ. ఇందులో నేను విలన్ గా మారడానికి కూడా ఒక కారణం వుంటుంది. కథలో చాలా ప్రాధన్యత వున్న పాత్ర.

ఇరవై ఏళ్ల క్రితం ‘ప్రియరాలు పిలిచింది’ సినిమాలో మమ్ముట్టి గారితో కలసి పని చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళుకు ఆయనతో కలసి చేయడం ఎలా అనిపించింది ?
మమ్ముట్టి గారితో పని చేయడం గొప్ప అనుభూతి. ఆయన్ని సెట్స్ లో అలా చూస్తూ వుంటాను. ఇందులో ఆయనికి ఎదురుతిరిగే పాత్ర చేశాను. అది పెద్ద సవాల్ గా అనిపించిది. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఆయన అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. ఆయన్ని మొదటిసారి బుడాపెస్ట్ లో కలిసినప్పుడు దుల్కర్ కంటే యంగ్ గా కనిపించారు. ఇదే విషయం ఆయనకి చెబితే నవ్వేశారు. నా వరకూ.. ఆయన నా టీచర్ నేను ఆయన స్టూడెంట్ ని.

ఏజెంట్ లో మీ పాత్ర పేరు ఏమిటి ?
ఇందులో నా పాత్ర పేరు గాడ్. ఏదైనా చేయగలిగే పవర్ ఫుల్ పాత్ర అది. తను వ్యవస్థపై, ఆ వ్యవస్థని క్రియేట్ చేసిన బాస్ పై రివెంజ్ తీసుకోవాలని చూస్తుంటాడు.

మీ పాత్ర ‘పఠాన్’ లో జాన్ అబ్రహం పాత్రకు సిమిలర్ గా వుందనిపిస్తుంది ?
విచిత్రంగా పఠాన్ కూడా ముగ్గురు ఏజెంట్స్ కి సంబధించిన కథ. వారికంటే ముందే మేము షూటింగ్ స్టార్ట్ చేశాం. మా కథ ముందే తయారైయింది. ఏజెంట్ కథకి ‘పఠాన్’ కథతో పోలిక లేదు. రెండు వేరు వేరు. మా సినిమాలో డిఫరెంట్ ములుపులు వుంటాయి. కథ భిన్నంగా వుంటుంది. ఏజెంట్ గేమ్… డిఫరెంట్ అండ్ టెర్రిఫిక్.

ఏజెంట్ లో గాడ్ పాత్ర కోసం స్పెషల్ గా హోమ్ వర్క్ చేశారా ?
కొన్ని మ్యాడ్ క్యారెక్టర్స్ ని చూశాను. నో ప్లేస్ ఫర్ ఓల్డ్ మెన్ తో పాటు మరికొన్ని హాలీవుడ్ సినిమాలు చూశాను. అలాగే విక్రమ్ లో రోలెక్స్ పాత్రని పరిశీలించాను. నా పాత్రలో కూడా మ్యాడ్ నెస్ వుంటుంది. నేను ఎంత హోమ్ వర్క్ చేసిన సురేందర్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ కావాలి అని అడిగేవారు. ఇందులో ప్రతిది లౌడ్ లార్జ్ ఎక్సయిటింగా వుంటుంది.

హీరోయిన్ సాక్షి వైద్య గురించి ?
సాక్షి చాలా బ్యూటీఫుల్. తను చాలా చక్కగా నటించింది. తనకు చాలా మంచి భవిష్యత్ వుంటుంది.

తెలుగు భాషతో మీకు పరిచయం లేదు. తెలియని భాషలో సినిమాలు చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఏజెంట్ ని ఎంపిక చేసుకోవడం వెనుక కారణం ఏమిటి ?
నేను కేవలం కథే చూస్తాను. కథ బావుంటే ఒప్పుకుంటాను. ఏజెంట్ విషయానికి వస్తే కథ, నా పాత్ర రెండూ నచ్చాయి. పైగా ఏకే ప్రొడక్షన్ హౌస్, దర్శకుడు సురేందర్ రెడ్డి.. ఎన్నో విజయాలు అందించారు. మమ్ముట్టి గారు, అఖిల్.. ఇలా అద్భుతమైన టీంతో కలసి పనిచేసే అవకాశం అరుదుగా వస్తుంది.మనకు పని పరిచయం లేని భాషలో పని చేయడం ఒక ఛాలెంజ్. ఏజెంట్ లో నా డైలాగులుని రెండు రోజులు ముందే అడిగి డే అండ్ నైట్ ప్రాక్టిస్ చేసేవాడిని. అయితే షాట్ రెడీ అన్నప్పుడు డైరెక్టర్ డైలాగ్స్ మార్చేస్తున్నా అనేవారు(నవ్వుతూ). షూటింగ్ చాలా ఫన్ అండ్ అడ్వెంచర్ గా సాగింది.

ఏజెంట్ షూటింగ్ లో మీకు ఎదురైనా అనుభవాలు ఏమిటి ?
దర్శకుడు సురేందర్ రెడ్డి గారు డెడ్లీ లుక్ కావాలని అడిగారు. నాలుగు లేయర్ల కాస్ట్యూమ్స్ తో అద్భుతంగా కుదిరింది. బుడాపెస్ట్ చలిలో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. తర్వాత కొన్ని యాక్షన్ సీన్లు మస్కట్ ఎడారి లో షూట్ చేశాం. 40 డిగ్రీల వేడి. లెదర్ జాకెట్ , హెవీ మెటిరియాల్ లాంగ్ కోట్ ధరించి షూట్ చేయాల్సి వచ్చింది. లోపల నుంచి చెమట బూట్లు నుంచి బయటికి వచ్చేది. అదొక హారిబుల్ ఫీలింగ్. చాలా క్రేజీ. అయితే ఆ కష్టానికి తగిన ఫలితం దొరుకుతుందనే నమ్మ్మకం వుంది.

ఏజెంట్ కి ముందు అఖిల్ గురించి తెలుసా ?
రామ్ చరణ్ నా ఫ్రెండ్. ఆయన ద్వారా అఖిల్ ని ఒకసారి కలిశాను. అప్పటికి ఆయన చాలా యంగ్ లిటిల్ బాయ్ లా కనిపించారు. కానీ ఏజంట్ సెట్ లో అఖిల్ ని చూసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా కనిపించాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. తన లుక్ మొత్తం మార్చేశాడు. తన డెడికేషన్ కి హ్యాట్సాఫ్.

తెలుగు లో మరిన్ని సినిమాలు చేయాలని ఉందా ?
నేను అన్నిటికి ఓపెన్ గా వున్నాను. ఈ సినిమా తర్వాత మలయాళంలో డెబ్యు చేస్తున్నాను. ఒక నటుడిగా అన్ని భాషల్లో చేయాలని వుంటుంది. ఏజెంట్ తర్వాత తెలుగులో కూడా అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను.

ఏజెంట్ లో మిమ్మల్ని ఎవరు ఎంపిక చేశారు ?
దర్శకుడు సురేందర్ రెడ్డి గారు. ఆయన నా ఎంపైర్ షో చూశారు. తర్వాత నిర్మాత అనిల్ గారు కూడా ఈ పాత్రకు నేను సరిగ్గా సరిపోతాని చెప్పారు.

‘ఏజెంట్’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?
‘ఏజెంట్’ స్పై థ్రిల్లర్, ముగ్గురు ఏజెంట్స్ కథ. క్యాట్ అండ్ మౌస్ చేజ్ .. రెండున్నర గంటల సినిమాని ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్ చేస్తారు. ఏజెంట్ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. మలుపులు, లార్జ్ యాక్షన్, విజువల్స్, సౌండ్ అన్నీ ప్రేక్షకులని అలరిస్తాయి.

వరంగల్ ఈవెంట్ కి హాజరయ్యారు కదా.. ఎలా అనిపించింది ?
ఇది చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. మేము హిందీ సినిమాల్లో కూడా ఈవెంట్స్ చేస్తాము. బయటికి వెళ్తాం. కానీ ఇక్కడ అభిమానులు లాయల్టీ అద్భుతం. అభిమానిస్తే ప్రాణం ఇచ్చేస్తారు. అలాగే లాయల్టీని మార్చుకోరు. ఇది చాలా గొప్ప విషయం.

ఏజెంట్ ట్రైలర్ విడుదలైన తర్వాత మీ అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ?
షూటింగ్ లో ఉన్నప్పుడే నాకు బిగ్గెస్ట్ కాంప్లీమెంట్ మమ్ముట్టి గారి నుంచి వచ్చింది. డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత మమ్ముట్టి గారు నన్ను చూసి.. ‘’ఫెంటాస్టిక్.. చాలా అద్భుతంగా చేశావు’’ అన్నారు. ఆ మాటలని ఎవరైనా రికార్డ్ చేసివుంటే బావుండేదని పించింది. ఇది లైఫ్ టైమ్ మెమరీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News