Tuesday, November 5, 2024

ఆ డైనోసార్ల బరువు 70 టన్నులు.. మెడ పొడవు 15 మీటర్లు

- Advertisement -
- Advertisement -

తూర్పు ఆసియాలో 160 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు మసలాడేవి. అయితే వీటికి పోటీగా పొడవాడి మెడ కలిగిన జంతువులు కూడా ఉండేవని మనకు తెలియదు. ఆ పొడవాటి మెడ ఉన్న జంతువు తాలూకు మెడ, పుర్రె శిలాజాలు బయటపడడంతో మమెంచి సారస్ సినోకానడోరం అనే డైనోసార్ జాతి జంతువులు కూడా ఉండేవని తెలుస్తోంది. వీటి మెడ 15 మీటర్ల పొడవు.

అంటే డబుల్ డెకర్ బస్సు కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దది. వాయువ్య చైనా లోని జింజియాంగ్ యువిఘుర్ అటానమస్ రీజియన్‌లో 160 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి రాళ్ల నుంచి ఈ శిలాజాలు 1987లో బయటపడ్డాయి. కానీ ఈ జంతువు పూర్తి మెడ పొడవును ఇటీవలనే శాస్త్రవేత్తలు తిరిగి సమీక్షించారు. ఈ డైనోసార్ శాకాహార సౌరోపాడ్ తెగకు చెందినది. అంటే పొడవైన మెడ, తోక,చిన్న తల, భారీ అవయవాలతో కూడిన పెద్ద చతుర్భుజ శాకాహార డైనోసార్. ముట్టి నుంచి తోక వరకు 50 మీటర్ల పొడవున పెరుగుతుంది.

70 టన్నులకు మించి బరువు ఉంటుంది. చాలా కొద్దిపాటి అవశేషాలు మాత్రమే లభ్యమైనప్పటికీ, ఈ డైనోసార్లతో దగ్గరి పోలికలు ఉన్న ఇతర డైనోసార్ల పూర్తి అవశేషాల బట్టి పరిశోధకులు వీటి మెడ పొడవు ఏమాత్రమో అంచనా వేయగలిగారు. ఇవి ఒకే చోట ఉండి, ఎలాంటి శక్తిని వెచ్చించకుండా టన్నుల కొద్ది శాకాహారాన్ని తీసుకునేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత భారీ శరీరంతో, పొడవాటి మెడతో, కుప్పకూలిపోకుండా ఇవి ఎలా నిలబడగలిగేవో శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు.

కానీ ఎక్స్‌రే స్కానింగ్ తీసి విశ్లేషించగా, వీటి వెన్నుముక తేలికపాటి గుల్ల బారి ఉంటుందని బయటపడింది. శరీరంలో ఎముకల్లో గాలి ఖాళీలు చాలా ఉన్నాయని, అవే తేలికబరుస్తున్నాయని తేలింది. అలాంటి తేలికపాటి ఎముకల గూడు లక్షణాలు పక్షుల్లో కనిపిస్తాయి. అందుకనే అవి సులువుగా ఎగురగలుగుతాయి. అయితే సాధారణంగా తేలికపాటి ఎముకలు పగుళ్లకు దారి తీస్తాయి. కానీ ఈ డైనోసార్ మెడ ఎముకలు ఇనుపరాడ్ వలె బలంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News