Wednesday, January 22, 2025

భూమిపై డైనోసార్లను అంతం చేసిన ఉల్కే చంద్రుడ్ని ఢీకొట్టింది

- Advertisement -
- Advertisement -

భూమిపై డైనోసార్లను అంతం చేసిన ఉల్కే చంద్రుడ్ని ఢీకొట్టింది
2020లో చంద్రుని నుంచి వచ్చిన మట్టి నమూనాలపై విశ్లేషణ
కర్టిన్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: 2020లో చంద్రునిపై నుంచి చైనా వ్యోమనౌక (చాంగే 5) భూమికి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరీక్షించగా చంద్రుని గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. చంద్రునిపై ఉల్క ప్రభావాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది భూగోళంపై డైనోసార్లను అంతమొందించిన ఉల్కతోసహా అత్యంత భారీ ఉల్క ప్రభావాన్ని కచ్చితంగా పోలి ఉందని శాస్త్రవేత్తలు గ్రహించారు. భూమిపై భారీ ప్రభావ సంఘటనలనే కాకుండా స్వల్ప ప్రభావాల పరంపరలను కూడా చంద్రుని మట్టి బయటపెట్టిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కర్టిన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు సూక్ష్మ గాజు పూసలను అధ్యయనం చేశారు. రెండు బిలియన్ సంవత్సరాల వయసు కలిగిన ఈ గాజు పూసలు చంద్రుని మట్టిపై కనిపించాయి. వాటిని చైనా వ్యోమనౌక భూమికి తీసుకు వచ్చింది.

ప్రపంచ శాస్త్రవేత్తల సమాజం ఈ పరిశోధనలో పాలుపంచుకుని మరింత లోతుగా పరిశోధనలు సాగించింది. ఉల్క అత్యధిక వేడి, ఒత్తిడి ప్రభావాల వల్లనే సూక్ష్మమైన గాజు పూసలు ఏర్పడ్డాయని పరిశోధకులు వెల్లడించారు. వాటి వ్యాప్తి వాటి కాలం గురించి సమాచారం అందిస్తాయని పేర్కొన్నారు. సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ఈ సిలికేట్ గాజు చిన్నతునకలు అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల కానీ లేదా చంద్రుని మట్టిపై అంతటా వ్యాపించిన భాగాలు కరిగిపోవడం వల్ల కానీ ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ పూసలు మైక్రోమీటర్‌లో పదోవంతు నుంచి కొన్ని మిల్లిమీటర్ల సైజువరకు గోళాకారం, అండాకారం, లేదా వేళ్ల మాదిరిగా విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. చంద్రునిపై ఇవి ఎలా ఎప్పుడు ఏర్పడ్డాయో సూకా్ష్మతి సూక్ష్మ స్థాయిలో విశ్లేషించ గలిగారు. చంద్రుని గాజు పూసల్లో కొన్నిటి వయసు భూమిపై ఏర్పడిన భారీ భౌగోళిక బిలాల సంఘటనలతో పోలి ఉన్నాయని, డైనోసార్ల అంతానికి కారణమైన చిక్స్‌లుబ్ ప్రభావ బిలం కూడా ఇందులో ఒకటని పరిశోధకులు వివరించారు.

Dinosaurs Killed Asteroid also hit to Moon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News