Thursday, January 23, 2025

భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం

- Advertisement -
- Advertisement -

ముదిరిన ఖలిస్థానీ చిచ్చు
ఇరు దేశాల మధ్య దౌత్యవేత్తలపై వెలివేటు

రగులుకున్న నిజ్జార్ హత్య ఉదంతం

భారతీయ ఏజెంట్ల హస్తం ఉందన్న ట్రూడో
తీవ్రంగా ఖండించి ప్రతి చర్యకు దిగిన ఇండియా

కెనడాలోని ఇండియన్ల పరిస్థితిపై ఆందోళన

న్యూఢిల్లీ /టొరంటో: భారత్, కెనడా మధ్య ఖలీస్థానీ వాదం చిచ్చు తీవ్రతరం అ యింది. కెనడా, ఇండియాలు పరస్పరం దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించా యి. కెనడాలో ఖలీస్థానీ నేత హత్య వెనుక భారతదేశ హస్తం ఉందని కెనడా అధికారికంగా ఆరోపించింది. ఇది తమ దేశంలోకి చొరబడటమే అవుతుందని ఆక్షేపించింది. ఈ వాదనను భారతదేశం తిప్పికొట్టింది. ఇది పూర్తిగా అసంబద్ధం అని పేర్కొంది. ఇక దౌత్య ప్రక్రియ చెల్లనేరదని పేర్కొంటూ భారతదేశంలోని కెనడా రాయబారి కెమెరాన్ మకెకెను ఐదురోజులలో దేశం నుంచి వదిలివెళ్లాలని ఆదేశించింది. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు కొందరు జూన్‌లో సర్రేలో జరిగిన ప్రముఖ సిక్కు వేర్పాటు వాది, 45 సంవత్సరాల హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు కారణం అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిపై భారతదేశం తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగింది. కెన డా ప్రధాని దురుద్ధేశపూరిత స్పందన ఇదని పేర్కొంది.

హర్దీప్ కెనడాలో ఉంటూ వస్తున్న భారతీయుడు. ఆయన నాయకత్వంలో ఖలీస్థాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చాలాకాలంగా చలామణిలో ఉంది. నిజ్జార్‌ను మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టుగా భారతదేశం ప్రకటించింది. పట్టిచ్చిన , చంపేసినా వారికి రూ 10 లక్షల పారితోషికం అందిస్తామని తెలిపారు. కెనడాలోని సర్రేలో జూన్ 18వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వారా వెలుపల ఆయనను టార్గెట్ చేసుకుని కాల్చి చంపారు. దీనిపై ఇటీవలే జి 20 సదస్సుకు మొక్కుబడిగా హాజరై కెనడాకు వెళ్లిన తరువాత ప్రధాని జస్టిన్ స్పందించారు. తమ దర్యాప్తు సంస్థలు జరిపిన సమగ్ర విచారణల్లో ఈ హత్యకు కారణం భారతీయ ఏజెంట్లే అని తెలుస్తోందని తెలిపారు. దేశ పార్లమెంట్‌లనే ఈ ఆరోపణ చేశారు. వెంటనే భారతీయ దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ను కెనడా నుంచి బహిష్కరిస్తున్నట్లు దేశ విదేశాంగ మంత్రి మెలాని జోలీ నిర్థారించారు. సీనియర్ దౌత్యవేత్త దేశం నుంచి వెళ్లిపోవాలని ఆమె ఆదేశించారు. పవన్ కుమార్ కెనడాలోని ఎంబసీలో రాయబారిగా ఉన్నారు. అయితే పవన్‌కుమార్ రాయబారిగా కాకుండా కెనడాలో ఇండియా నిఘా విభాగం అధినేతగా వ్యవహరిస్తున్నారని కెనడా విదేశాంగ కార్యాలయం తెలిపింది. దీనిని ఖండించి, దీనికి ప్రతిగా ఇప్పుడు కెనడా దౌత్యవేత్తను భారతదేశం బహిష్కరించింది. భారతదేశం ఏ విషయంలో అయినా ప్రజాస్వామిక పంథాకు కట్టుబడి ఉంటుంది.

చట్టాన్ని గౌరవిస్తుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరించడం అలవాటు లేదని తెలిపింది. కెనడాలో తిష్టవేసుకుని ఉన్న ఖలీస్థానీ వేర్పాటు వాదుల ఆగడాలు, భారత వ్యతిరేక చర్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఈ విధంగా కెనడా తీవ్రస్థాయి నిరాధార ఆరోపణలకు దిగుతోందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఖలీస్థానీ ఉగ్రవాదులకు కెనడాలో ఆశ్రయం ఇవ్వడ ం, వారి చర్యలు పేట్రేగిపొయ్యేలా చేయడం , పైగా నిరాధార ఆరోపణలు చేయడం అనుచితం అని వెల్లడించారు. భారతదేశ ప్రాదేశిక స్వతంత్రతకు, సర్వసత్తాకతకు భంగం కల్గించే ఎటువంటి చర్యలను అయినా ఎంతకాలం భరించాల్సి ఉంటుందని ప్రశ్నించారు. కెనడా రాజకీయ నేతలు తరచూ అక్కడి ఖలీస్థానీ నేతల పట్ల సానుభూతి వ్యక్తం చేయడంతో పరిస్థితి దిగజారిందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News