Monday, April 14, 2025

జన్యుశాస్త్రవేత్తల ఘనత

- Advertisement -
- Advertisement -

ఈ డైర్ వోల్ఫ్ పాపాయిలను చూశారా.. ఎంతముద్దుగా ఉన్నాయో… వీటి పేర్లు రోములస్, రెమస్.. ఇవి దాదాపు 12,500 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైర్ వోల్ఫ్ జాతి కి చెందిన వోల్ఫ్ పిల్లలు అంటే ఆశ్చర్యం కలగక మారదు. కానీ ఇది నిజం. టెక్సాస్ కు చెందిన జన్యు శాస్త్రవేత్తలు ఈ విశ్వామిత్ర సృష్టి చేశారు. శాస్త్రీయ ప్రపంచంలో ఇదో అద్భుతం. రోములస్, రెమస్ వయస్సు ఆరు నెలలే. ఇప్పటికే నాలుగు అడుగుల పొడుగు, 36 కిలోల బరువుతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పురాతన డిఎన్‌ఏ, క్లోనింగ్, జన్యుపరమైన మార్పులు చేయడం ద్వారా డైర్ వోల్ఫ్ పిల్లలను సృష్టించినట్లు టెక్సాస్ కు చెందిన కొలోసల్ బయో సైన్సెస్ తెలిపింది.

హెచ్ బివో సీరీస్ -గేమ్ ఆఫ్ థ్రోన్స్ ద్వారా ఈ డైర్ వోల్ఫ్ లు ప్రజలను మంత్ర ముగ్థులను చేస్తున్నాయి.తోడ్లు అంటే భయంకరమైన మృగాలే గుర్తుకు వస్తాయి.ఉత్తర అమెరికాలో భయంకరమైన తోడేళ్లు ఉండేవి అవి బూడిద రంగు తోడేళ్ల కంటే పరిమాణంలో చాలా పెద్దవి. మందమైన బొచ్చు, బలమైన దవడలతో భయం కొలిపేవి.అయితే శాస్త్రవేత్తలు బూడిదరంగు తోడేలు కు చెందిన డిఎన్ ఏ ఉపయోగించి ఈ ప్రతిసృష్టి చేశారట. డైర్ వోల్ఫ్ పాపాయిలను చూసిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మురిసి పోయి తన సంత విష్ లిస్ట్ లో పోస్ట్ చేశారు. దయచేసి ఒక చిన్న పెంపుడు జంతువు ఉన్ని మముత్ ను తయారుచేయాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News