Monday, January 20, 2025

గురుకులాల్లో ఎంబిసి విద్యార్థులకు నేరుగా ప్రవేశం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబిసి) కులాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బిసి సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఎంబిసి కులాల్లో సంచార జాతులతో పాటు ఇతర పిల్లలు పలు కారణాలతో విద్యకు దూరం అవుతున్నారు. ప్రవేశ పరీక్ష, ఇతరత్రా నిబంధనల వల్ల వారు విద్యకు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందని.. అందుకే వారికి ప్రత్యేక కోటాలో అడ్మిషన్ ఇవ్వాలని నిర్ణయించామని బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాసంస్థల్లో ఎంబిసి విద్యార్థులకు ప్రత్యేక కోటా ద్వారా ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా సీటు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఎంబిసి కులాల్లో చాలా మంది పిల్లలు వివిధ కారణాల వల్ల విద్యకు దూరం అవుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

ప్రవేశ పరీక్ష రాయకపోవడం, వివిధ కారణాల వల్ల మధ్యలో చదువు మానేసిన పిల్లలు వారి తల్లిదండ్రులకు పనిలో సాయంగా ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించి.. తిరిగి చదువు వైపు మళ్లించేందుకు ప్రత్యేక కోటా నిర్ణయం తీసుకున్నారు. సొసైటీ పరిధిలో వారికి అందుబాటులో ఉన్న గురుకులంలో సీటు పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచే నూతన విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. సాధారణంగా గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆరు నుంచి పదో తరగతి వరకు బ్యాక్‌లాగ్ సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశానికి కూడా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇకపై ఎంబిసి కులాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష మార్కులు ప్రామాణికంగా తీసుకోకుండానే, వారు పరీక్ష రాయకపోయినా నేరుగా సీటు ఇవ్వనున్నారు.

Direct Admission for MBC students in Gurukul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News