Wednesday, January 22, 2025

ముంబయి నుంచి తాష్కెంట్‌కు డైరెక్ట్ ఫ్లైట్

- Advertisement -
- Advertisement -

2న ప్రారంభించనున్న ఉజ్బెకిస్తాన్ ఎయిర్‌వేస్
ముంబయి : ఉజ్బెకిస్తాన్ ఎయిర్‌వేస్ జెఎస్‌సి ఏప్రిల్ 2 నుంచి ముంబయి నుంచి తాష్కెంట్‌కు సరాసరి విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వారానికి రెండు సార్లు సర్వీసులు నడుస్తాయి. తొలి విమాన సర్వీసును న్యూఢిల్లీలోని ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ రాయబారి సర్దార్ రుస్తమ్‌బయేవ్, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ కాన్సల్ విజయ్ కలంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు.

ముంబయి నుంచి తాష్కెంట్‌కు ఆ నాన్‌స్టాప్ సర్వీసుల ద్వారా కేవలం మూడు గంటలలో చేరుకోవచ్చు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వర్తక వాణిజ్యాల వల్ల ముంబయి నుంచి తాష్కెంట్‌కు సరాసరి విమాన సర్వీస్ నిర్వహించడంఆవశ్యకమైంది. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్, బుఖారా, ఖీవ వంటి ప్రాచీన పర్యాటక కేంద్రాలను తాష్కెంట్ నుంచి చేరుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News