Friday, December 20, 2024

చైనాకు నేరుగా విమానాలు ఇప్పట్లో లేనట్లే !

- Advertisement -
- Advertisement -

 

Fire Broke Out in Air India Aeroplane

బీజింగ్: చైనా అమలుచేస్తున్న కొవిడ్ నిబంధనల కారణంగా సమీప భవిష్యత్తులో భారత్, చైనా మధ్య నేరుగా వెళ్లే విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైనాలోని విమానాశ్రయాలలో దిగే ప్రయాణికులలో ఎవరికైనా కొవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ప్రతిసారి హఠాత్తుగా విమాన సర్వీసులను రద్దు చేస్తూ తన విధానాలను ఎప్పటికప్పుడు చైనా మార్చుకోవడం వల్ల చైనాకు నేరుగా ప్రయాణికుల విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఇప్పట్లో ఉండకపోవచ్చునని వర్గాలు పేర్కొన్నాయి. 2019 చివరిలో వూహాన్‌లో మొదటి కరోనా వైరస్ కేసు వెలుగు చూసిన తర్వాత భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

విమాన సర్వీసుల రద్దు వల్ల చైనాలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులతోపాటు చైనాలో పనిచేస్తున్న భారతీయులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మూడేళ్ల తర్వాత చైనా ఇటీవలే వ్యాపారులు, ఉద్యోగుల రాకపోకలను పునరుద్ధరించడానికి వీసాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో కొవిడ్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన దాదాపు 23 వేల మంది విద్యార్థులు, వీరిలో అత్యధికులు వైద్య విద్యార్థులు చదువులను కొనసాగించడానికి తిరిగి చైనాకు వెళ్లేందుకు సన్నాహాలు చేపట్టారు.

అయితే చైనాకు నేరుగా విమనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మూడవ దేశం మీదుగా చైనా చేరుకోవడం చాలా ఖరీదు వ్యవహారంగా మారడంతో వారంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మూడవ దేశం ముఖ్యంగా హాంకాంగ్ మీదుగా చైనాకు కేవలం 100 మంది విద్యార్థులు మాత్రమే ఇప్పటివరకు వెళ్లగలిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News