Monday, November 18, 2024

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు నేరుగా విమానాలు

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ నుంచి గతేడాది 2.3 మిలియన్ల మంది ప్రయాణం

మనతెలంగాణ/హైదరాబాద్:  గూగుల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, ఎయిర్ బస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా, ఐటీ, టెక్నాలజీలకు కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో పాటు విదేశాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అందులో భాగంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గతేడాది 2.3 మిలియన్ల మంది ప్రయాణించారు. 2023 డిసెంబర్ నెలలో 11 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 23వ తేదీ 2023న అత్యధిక సింగిల్ డే ప్యాసింజర్‌గా నమోదయ్యింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ దేశాలకు డైరెక్ట్ విమానాల సదుపాయాన్ని కలిగి ఉంది. ఇటీవల లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని ప్రారంభించింది.

విమానాల వివరాలు ఇలా….
హైదరాబాద్ నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు నడుస్తుండగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి. అందులో దుబాయ్, మస్కట్, దోహా, అబూ ధాబీ, జెడ్డా, సింగపూర్, కౌలాలంపూర్, దమ్మామ్, షార్జా, రియాద్, కువైట్, కొలంబో, బహ్రెయిన్, బ్యాంకాక్, లండన్, ఢాకా హాంకాంగ్, బ్యాంకాక్, మాలే, రాస్ అల్ ఖైమాకు డైరెక్ట్‌గా విమానాలు నడుస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News