Sunday, December 22, 2024

అమెరికాలో గ్రాడ్యుయేట్ అయితే విదేశీయులకు డైరెక్ట్ గా గ్రీన్ కార్డు!

- Advertisement -
- Advertisement -

డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన

మియామీ: అమెరికా కాలేజ్ ల నుంచి గ్రాడ్యుయేట్ అయ్యే విదేశీ విద్యార్థులకు డైరెక్ట్ గా గ్రీన్ కార్డు ఇవ్వాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై ‘మీ ప్రణాళికలేమిటి?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా జవాబిచ్చారు.  ఆయన నుంచి ఇలాంటి సమాధానం రావడం చాలా మందని ఆశ్చర్యపరిచింది.

అధికారంలోకి వచ్చిన తొలి రోజునే దీనిపై దృష్టి సారిస్తానని డొనాల్డ్ ట్రంప్ అనడం మరింత ఆశ్చర్యపరిచింది. వీసా సమస్యల కారణంగా ఇండియా, చైనా వంటి దేశాల నుంచి వచ్చే చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నారని ఆయన తెలిపారు. వారు స్వదేశాలకు వెళ్లి వేలాది మందికి తమ దేశంలో ఉపాధి కల్పిస్తున్నారని కూడా ఆయన వివరించారు.

ట్రంప్ ఇదివరలో అక్రమ వలసదారుల వల్ల అమెరికాలో నిరుద్యోగం, హింస, నేరాలు, వనరుల దోపిడి పెరిగిపోతున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నదని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అమెరికన్ల ఉపాధి అవకాశాలు దెబ్బతిన కుండా ఆయన గతంలో అనేక రూల్స్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News