Monday, December 23, 2024

ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48% పెరిగాయి..

- Advertisement -
- Advertisement -

అడ్వాన్స్ టాక్స్ చెల్లింపుల్లో 41 శాతం వృద్ధి

Direct tax collections increased by 48%

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202122)లో అడ్వాన్స్ టాక్స్(ముందస్తు పన్ను) చెల్లింపు 41 శాతం పెరుగుదలతో భారీ వృద్ధిని నమోదు చేశాయి. దీంతో వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయం నుంచి పన్ను వసూళ్లు 48 శాతానికి పైగా పెరిగి రికార్డు నెలకొల్పాయి. ఈ పరిణామం కరోనా వైరస్ మహమ్మారితో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న ఆర్థిక పునరుద్ధరణను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, 202122లో మార్చి 16 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.63 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఏడాది క్రితం 2020-21 ఇదే కాలంలో ఇది రూ.9.18 లక్షల కోట్లు నమోదైనాయి. కరోనా మహమ్మారికి ముందు 2019-20తో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 35 శాతం పెరిగి రూ.9.56 లక్షల కోట్లు నమోదు చేశాయి. వీటిలో వ్యక్తిగత ఆదాయంపై పన్ను, కంపెనీలకు లాభాలపై పన్ను, సంపద పన్ను, వారసత్వ పన్ను, బహుమతి పన్ను ఉన్నాయి. అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు 40.75 శాతం పెరిగి రూ.6.62 లక్షల కోట్లకు చేరుకున్నాయి. నాలుగో విడత డిపాజిట్ చేయడానికి చివరి తేదీ మార్చి 15గా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1.87 లక్షల కోట్లు రీఫండ్ చేశారు. మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కంపెనీ పన్ను వాటా 53 శాతం, వ్యక్తిగత ఆదాయపు పన్ను వాటా 47 శాతం ఉంది. దీనిలో షేర్లపై సెక్యూరిటీల లావాదేవీ పన్ను ఉంటుంది. 2021-22 బడ్జెట్‌లో నిర్దేశించిన రూ. 11.08 లక్షల కోట్ల లక్ష్యం కంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు బడ్జెట్‌లో సవరించిన అంచనా రూ.12.50 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కంపెనీ పన్ను వాటా రూ.7,19,035.0 కోట్లు కాగా, సెక్యూరిటీల లావాదేవీల పన్నుతో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.6,40,588.3 కోట్లుగా ఉంది. ప్రకటన ప్రకారం, 2022 మార్చి 16 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 15,50,364.2 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో రూ. 11,20,638.6 కోట్లుగా ఉన్నాయి. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2019-20లో రూ. 11,34,706.3 కోట్లు, 2018-19లో రూ. 11,68,048.7 కోట్లుగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News