Wednesday, January 22, 2025

వికసిత భారత్ కు దిశానిర్దేశం

- Advertisement -
- Advertisement -

ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సాగిన మధ్యంతర బడ్జెట్

యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట

పరిశోధన కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులేదు

మౌలిక రంగానికి 11.1% పెరుగుదలతో 11.11లక్షల కోట్ల కేటాయింపు

సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు 50ఏళ్ల పాటు రూ.75వేల కోట్ల వడ్డీలేని రుణం
రక్షణ రంగానికి 20శాతం పెరిగిన కేటాయింపులు
అన్ని ఆగ్రో క్లైమెట్ జోన్లకు నానో డిఎపి సరఫరా

ఐదు సమీకృత అక్వా పార్కులు

మధ్యంతర బడ్జెట్‌లో నిర్మలాసీతారామన్
ప్రజాకర్షక పథకాలకు స్వస్తి, వేతన జీవులకు నిరాశ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో మధ్యతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడం గమనార్హం. ఎన్నికల సంవత్సరం అయినప్పటికీ ఆర్థిక మంత్రి ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లక పోవడంతో పాటు మౌలిక సదుపాయాల రంగానికి రూ.11.11 లక్షల కోట్ల మేరకు కేటాయింపులు జరపడంతో పాటుగా గత పదేళ్లుగా మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కొనసాగిస్తామని ప్రకటించారు. ఏప్రిల్‌నుంచి రాబోయే నాలుగు నెలల కాలానికి సమర్పించిన తాత్కాలిక బడ్జెట్ పరిమాణం మొత్తం రూ.47.66 లక్షల కోట్లు కాగా, వివిధ మార్గాలద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు.దాదాపు గంట పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయం పన్ను శ్లాబుల్లో ఎలాంటి మా ర్పులు చేయకపోవడం గమనార్హం. అయితే ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి మాత్రం ఊరట కల్పించారు. దేశంలో ఉన్నది నాలుగు వర్గాలు..పేదలు, రైతులు,యువత, మహిళలు(గరీ బీ, యూత్,అన్నదాత,నారీశక్తి.. జ్ఞాన్) అని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించినట్లుగా గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ నాలుగు వర్గాలను వికసిత్ భారత్ మూలస్తంభాలుగా ప్రకటించింది.ఈ తాత్కాలిక బడ్జెట్‘ జ్ఞాన్’సాధికారికతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చడమే తమ లక్షమని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ దిశగానే బడ్జెట్‌లో చర్యలను ప్రకటించారు.‘ 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి భారత్‌గా చేయాలన్న కలను సాకారం చేయడానికి రా బోయే అయిదు సంవత్సరాలు కనీ వినీ ఎరుగని అభివృద్ధి, బంగారు క్షణాలుగా ఉంటాయి’ అని ఆర్థిక మంత్రి అన్నా రు. ‘సంస్కరణ, నిర్వహణ, పరివర్తన ’అన్న సూత్రం మార్గదర్శకంగా తమ ప్రభుత్వం వచ్చే తరం సంస్కరణలను కొనసాగిస్తుందని ఆమె చెప్పారు.
మౌలిక రంగానికి 11 శాతం నిధుల పెంపు
గత ఏడాదితో పోలిస్తే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆహా రం, ఎరువులు, ఇంధన సబ్సిడీలను 8శాతం మేర తగ్గించాలని మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అ యితే గ్రామీణ ఉపాధి పథకం అయిన ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’కు కేటాయింపుల్లో ఎ లాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న ప్రస్తుత వృద్ధి రేటును నిలకడగా కొనసాగించడంతో పాటుగా మరిన్నిఉపాధి అవకాశాలను రోడ్లు, రేవు లు, విమానాశ్రయాలు లాంటి మౌలిక రంగంలో వ్యయాన్ని 11 శాతం మేర అంటే రూ.11.1 లక్షల కోట్లకు పెంచారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చే యడం కోసం కేంద్రం రాష్ట్రాలకు రూ.1.3 లక్షల కోట్ల నిధులను సమకూరుస్తుంది.
2 కోట్ల ఇళ్ల నిర్మాణం
బస్తీలు, అద్దె ఇళ్లలో నివసించే పేదలు, మధ్య తరగతి వారి సొంతింటి కలను సాకారం చేయడానికి పిఎం ఆవాస్ యోజన కింద రాబోయే అయిదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్షంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే గత తొమ్మిదేళ్ల కాలంలో 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొద్ది రోజుల క్రితం నీతి ఆయోగ్ ప్ర కటించిందని, ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’కు కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత వల్లనే ఇది సాధ్యమయిందని నిర్మ లా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. కాగా పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి వాటిని ప్రపంచ స్థాయిలో మార్కెట్ చేస్తుందని కూడా మంత్రి తెలిపారు.
‘అన్నదాత’కు మరింత చేయూత
కాగా కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. రైతులను ‘అన్నదాతలు’గా అభివర్ణించిన నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి కోసం ప్రబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద్వారా 38లోల మంది అన్నదాతలకు ప్రయోజనం చే కూరిందని,10లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు.‘ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ యోజన’ద్వారా 2.4 లోల స్వయం సహాయక బృందాలకు, వ్యక్తిగతంగా మరో 60వేల మందికి రుణ సహాయం అందించినట్లు చెప్పారు. పంట కోత అనంతరం నష్టాల నివారణ, దిగుబడి, ఆదా యం పెంపు కోసం చర్యలు తీసుకొంటామని చెప్పారు. మొ త్తంమీద వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ.1.27 లక్షల కోట్లు, మత్స, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7,105 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖకు రూ.3,290 కో ట్లు బడ్జ్జెట్‌లో కేటాయించారు. నూనె గింజల ఉత్పత్తిలో స్వ యం సమృద్ధిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కాగా ఎన్నికల ముందు ఏటా పిఎం కిసాన్ సాయాన్ని రూ.6 వేలనుంచి రూ.8 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి కానీ బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.పంట రుణాలమంజూరు లక్షాన్ని పెంచుతారని ఆ శించారు కానీ బడ్జెట్‌లో ఆ దిశగా ఎలాంటి ప్రకటనా లేదు.
‘లఖ్‌పతి దీదీ’
ఇక నారీమణులను లక్షాధికారులను చేసే ‘లఖ్‌పతి దీదీ’ పథకాన్ని మూడు కోట్ల మందికి విస్తరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.అలాగే మహిళలకు ఉన్నత విద్యను అందించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సాధికారత కోసం పలు చర్యలను చేపట్టామని, గత పదేళ్ల క్లాంలో ఇవి సత్ఫలితాలను ఇచ్చాయని కూడా నిర్మలమ్మ తెలియజేశారు. 9 14 ఏళ్ల మధ్య బాలికలు గర్భాశయ కేన్సర్ బారిన పడకుండా ఉండేలా వ్యాక్సినేషన్‌ను చేపడతామని కూడా ప్రకటించారు. దేశ శ్రేయస్సు యువత సాధికారతపై ఆధారపడి ఉందన్న మంత్రి ‘స్కిల్ ఇండియా’ మిషన్ కింద 1.4 కోట్ల మంది యువతకు శిక్షణను అందించినట్లు చెప్పారు.సాంకేతిక రంగంలో నరిశోధనలను ప్రోత్సహించడం కోసం కార్పస్ నిధిని ఏర్పాటు చేస్తామని, ఇందు కోసం టెక్ కంపెనీలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను అందిస్తామని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధాన పథకాల్లో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ద్వారా ఉచిత కరెంట్‌ను అందించడానికి ఉద్దేశించిన పథకం కూడా ఉంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి ఏటా రూ.18 వేల దాకా ఆదాయం లభిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. మరో వైపు జిడిపిలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5.1 శాతానికి పరిమితం చేసేందుకు చర్యలను కొనసాగిస్తామని తెలిపారు. 2025 26 నాటికి ఆర్థిక లోటును 4.5 శాతానికి తగ్గిస్తామని గత బడ్జెట్ ప్రసంగంలో తాను చెప్పానని, ఆ దిశగానే తాము ముందుకు సాగుతున్నామని కూడా నిర్మలమ్మ చెప్పారు.

తమ ప్రభుత్వం ‘జిడిపి’(గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పెర్ఫార్మెన్స్)ఆధారంగా ముందుకు సాగుతోందని చెప్పిన ఆర్థిక మంత్రి సరైన విధానాలు, నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. సమర్థపాలన వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం, ఆదాయాలు పుంజుకోవడం, ప్రజలు తమ భవిష్యత్తుపై ఆశతో ముంగుకు సాగడం అభివృద్ధిని సూచిస్తోందన్నారు. మూడేళ్లుగా 7 శాతం వృద్ధి రేటుతో జి20 దేశాల్లో భారత్ వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేయడం ఈ ప్రభుత్వ మెరుగైన పనితీరుకు నిదర్శనమని నిర్మలా సీతారామన్ చెప్పారు.ఈ కారణం వల్లనే దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 201423మధ్య కాలంలో 596 బిలియన్ డా లర్లకు పెరిగాయని కూడా ఆమె చెప్పారు. రాబోయే లోక్‌స భ ఎన్నికలకు బిజెపి సర్వ పన్నద్ధంగా ఉందన్న ఆత్మవిశ్వా సం నిర్మలా సీతారామన్ ప్రసంగంలో స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు పేర్కొనడం విశేషం.

Opposition

Ruling party

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News