Monday, December 23, 2024

‘మంగళవారం’లో నెక్స్ట్ లెవెల్‌లో ట్విస్టులు

- Advertisement -
- Advertisement -

యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా ’మంగళవారం’. పాయల్ రాజ్ పుత్, ’రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ముద్ర మీడియా వర్క్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ’ఎ’ క్రియేటివ్ వర్క్ సంస్థ చిత్రాన్ని నిర్మించింది. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన తారాగణం. ఈనెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
అంత సులభం కాదు…
సమకాలీన కథతో క్యారెక్టర్ బేస్డ్ సినిమాగా కమర్షియల్ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఇటువంటి సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులభం కాదు. విజువలైజేషన్ నాకు తప్ప సినిమాటోగ్రాఫర్ కి కూడా తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్‌కి కూడా అంతే. సినిమాకు అన్నీ కుదిరాయి.

జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి…
పాయల్ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులందరూ షాక్ అవుతారు. దాంతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయి. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి పర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేసింది. కమర్షియల్ సినిమాలు ఒక మీటర్ మీద వెళతాయి కాబట్టి చేయడం కష్టం కాదు. కానీ ఇటువంటి సినిమాలు తీయడం కష్టం.
ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది…
’మంగళవారం’ సినిమాలో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే… న్యూడ్ అని కొందరు అన్నారు. కానీ అందులో గమనిస్తే… కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు.

నక్ట్స్ లెవెల్‌లో ట్విస్టులు…
సినిమాలో ఒక్క ట్విస్ట్ కాదు, చాలా ఉన్నాయి. మాస్క్ వెనుక ఎవరు ఉన్నారో చూస్తే షాక్ అవుతారు. చివరి 45 నిమిషాల్లో నెక్స్ లెవెల్ ట్విస్టులు ఉంటాయి. మ్యూజిక్ కూడా అద్భుతం. ’రంగస్థలం’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న సౌండ్ డిజైనర్ ఎంఆర్ రాధాకృష్ణ ఈ సినిమాకు నెకస్ట్ లెవల్ లో చేశారు. థియేటర్లలో భారీ సినిమా చూస్తున్నట్లు ఉంటుంది.
’మంగళవారం’ కు పొడిగింపు ఉంటుంది…
మంగళవారం శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ ఫోన్ చేశారు. ”మంచి టైటిల్ అజయ్! నేను చాలాసార్లు ఆ టైటిల్ పెడదాం అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు” అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉంది. ’మంగళవారం’ సినిమాకు పొడిగింపు అయితే ఉంటుంది. సీక్వెల్, ప్రీక్వెల్, ఫ్రాంచైజీ… ఏం అంటారో నాకు తెలియదు. ఎక్స్‌టెన్షన్ అయితే ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News