Monday, December 23, 2024

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

Director AK Sinha planting plants at Nehru Zoo

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని నెహ్రూ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ ఎకె సిన్హా కోరారు. ఆదివారం నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. క్యూరేటర్ నాగమణి,హకీం, సతీష్‌బాబులతో కలిసి జూలోని గార్డెన్ ప్రాంతంలో ఫికస్ జాతులు, ఇతర వృక్ష జాతుల మొక్కలను ఆయన నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు పెంపకం.. సంరక్షణ తమ జీవనంలో భాగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జూ పార్కు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News