Monday, December 23, 2024

బాపు అలా చేయడంతో షాకయ్యా: సునీత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సునీత సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ ఫీల్డ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె ఒక ఇంటర్వూలో మాట్లాడారు. శ్రీరామరాజ్య సినిమా డబ్బింగ్ జరుగుతోందని, తాను డబ్బింగ్ రూమ్‌లోకి వెళ్లగానే డైరెక్టర్ బాపు ఏదో రాసుకుంటున్నారు. “నన్ను చూడగానే లేచి నిలబడి నాకు నమస్కరించడంతో నేను షాక్‌కు గురయ్యా” అని తెలిపారు. “అక్కడి ఉన్న బాలకృష్ణ వెంటనే నాతో నీ కలకు, నీ విద్యకు ఆయన ఇస్తున్న సంస్కారం” అని చెప్పారు. “బాపు నుంచి నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, నీ వీరాభిమానిని అని బాపు అని రాయడంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి” అని సునీత తెలిపారు. అక్కడ ఉన్న బాలు కూడా కుళ్లుకున్నారని చెప్పారు. ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News