Monday, December 23, 2024

‘వాల్తేరు వీరయ్య’ కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’వాల్తేరు వీరయ్య’ అభిమానులు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ’వాల్తేరు వీరయ్య’ ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతున్న నేపధ్యంలో దర్శకుడు బాబీ కొల్లి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అందరినీ అలరించే ‘వాల్తేరు వీరయ్య’…
నిజానికి ఈ కథ లాక్ డౌన్‌కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చెప్పాను. అయితే లాక్‌డౌన్‌లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకీ అలవాటు పడ్డారు. డిఫరెంట్ కంటెంట్‌కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేక దృష్టి పెట్టాం. దాంట్లో నుండి వచ్చిన క్యారెక్టరే రవితేజది. ఒక ఫ్యాన్ బాయ్‌గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్‌గా డిజైన్ చేశాను. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీసి సెంటర్ ఆడియన్స్‌తో పాటు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని లక్షణాలు ‘వాల్తేరు వీరయ్య’లో కనిపిస్తాయి.

కలర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్…
సినిమాలోని ప్రతి సీన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్స్ వుంటాయి. పండక్కి రాబోతున్న కలర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ వున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’.
అలా టైటిల్‌ని లాక్ చేశాం…
’వెంకీ మామ’ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో వున్నప్పుడు చిరంజీవి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల వల్లనే మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బావుంటుందని అనిపించింది. ఇది చిరంజీవికి కూడా నచ్చింది. అలా ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్‌ని లాక్ చేశాం.

మరో ఆలోచన లేకుండా ఓకే…
రవితేజ చాయిస్ నాదే. ఆయనని తీసుకోవాలనే ఆలోచన రావడం, చిరంజీవికి చెప్పడం, ఆయన మరో ఆలోచన లేకుండా ఓకే అనడం జరిగింది. చిరంజీవిపై వున్న ప్రేమ, అభిమానం, నాపై వున్న నమ్మకంతో రవితేజ ఒప్పుకోవడం జరిగింది.
ఫన్ టైమింగ్‌లో ఆయన మాస్టర్…
చిరంజీవి డ్యాన్స్‌తో పాటు ఫన్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఫన్ టైమింగ్‌లో ఆయన మాస్టర్ . మనం ఫన్ ఇవ్వగలిగితే దాన్ని స్కై లెవల్ కి తీసుకెళ్ళిపోతారాయన. ఆ మ్యాజిక్ అంతా చూస్తూ పెరిగాను. ఈ ఎనర్జీ అంతా ఆయన నుండి తీసుకోవడం జరిగింది.

మ్యూజిక్ ఆల్బమ్ బ్లాక్‌బస్టర్…
చిరంజీవి, దేవిశ్రీలది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. సినిమా థియేటర్‌కి వచ్చే ముందు మొదట గెలిచేది ఆడియో పరంగా. అలా మమ్మల్ని గెలిపించిన దేవిశ్రీ ప్రసాద్‌కి మా టీం అందరి తరపున కృతజ్ఞతలు.
తెలుగుతో పాటు హిందీలో…
చిరంజీవి, రవితేజలకు హిందీలో మంచి మార్కెట్ వుంది. ఈ ఇద్దరు హీరోలు అక్కడి ఆడియన్స్‌కి చాలా ఇష్టం. ‘వాల్తేరు వీరయ్య’ తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News