Wednesday, January 22, 2025

“కన్యాకుమారి”తో వస్తోన్న పుష్పక విమానం దర్శకుడు దామోదర

- Advertisement -
- Advertisement -

ఆనంద్ దేవరకొండ హీరోగా గతంలో పుష్పక విమానం అనే ఫుల్ లెంగ్త్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ తీసి ఆకట్టుకున్న దర్శకుడు దామోదర. మొదటి సినిమాతోనే విషయం ఉన్నవాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టేకింగ్ తో పాటు మేకింగ్ తోనూ మెప్పించాడు. పుష్పక విమానం వంటి మినిమం బడ్జెట్ మూవీతోనే మాగ్జిమం ఎంటర్టైన్ చేసిన దామోదర ఈ సారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీతో వస్తున్నాడు. దామోదర స్వీయదర్శకత్వంలో ర్యాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి కన్యాకుమారి అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలామందికి నోస్టాల్జిక్ ఫీలింగ్స్ ను ఇస్తోంది. పుష్పక విమానంలో ఓ హీరోయిన్ గా నటించిన గీతా శైనీ, శ్రీ చరణ్ రాచకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ఇది. మొదటి చిత్రాన్ని తెలంగాణ ప్రాంతం నేపథ్యంలో చూపించిన దామోదర ఈ కథను శ్రీకాకుళం నేపథ్యంలో గ్రామీణ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News