సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కె.దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత డివై చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఇప్పటివరకూ చూసిన ప్రేమ కథలకు ‘లవ్ యు రామ్’ చాలా భిన్నంగా ఉంటుంది.
ప్రేమించడమే జీవితం అని నమ్మే ఒక అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమాలో నిజమైన ప్రేమని చెప్పాం. నేను ,దశరధ్ చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఆయన అందించిన ఈ కథ యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్, ఎన్‌ఆర్‌ఐలకు బాగా నచ్చుతుంది. ఇందులో కథే హీరో. ఈ కథ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే కొత్త వాళ్ళతో చేయడమే కరెక్ట్ అనిపించింది. ప్రేక్షకులకు మంచి విజువల్ ఫీస్ట్‌లా వుంటుంది ఈ సినిమా”అని అన్నారు.