దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ’సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు హను రాఘవపూడి మీడియాతో మాట్లాడుతూ “సీతారామం … చాలా ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చిన తర్వాత ‘సీతారామం’ అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. ఇక ‘సీతారామం’ పూర్తిగా ఫిక్షన్. ఇది లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ. ఇక నేను, స్వప్న కలసి హీరోగా దుల్కర్‌ని అనుకున్నాం. సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్ అద్భుతమైన పాటలను అందించాడు. ఈ సినిమాలో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పీరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి, గతానికి నడుస్తూ వుంటుంది.
ఇందులో రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే. టీజర్ లో చెప్పినట్లు రామ్ ఒక అనాధ. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక సైనికుడు. రేడియోలో తన గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుంతుంది. తను అనాధ అని తెలిసిన తర్వాత చాలా మంది అతనికి ఉత్తరాలు రాశారు. అలా వచ్చిన ఒక సర్‌ప్రైజ్ లెటర్ తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ లెటర్‌లో ఏముందో ఇప్పటికీ సస్పెన్స్. ఆ లెటర్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ జరుగబోతుందో అదే సీతారామం కథ. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్‌తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమేజాన్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేసే ప్లాన్ ఉంది”అని అన్నారు.
Director Hanu Raghavapudi interview about ‘Sita Ramam’