Thursday, November 21, 2024

ఫన్, రోమాన్స్, యాక్షన్ ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గురువారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఫన్, రోమాన్స్, లవ్ అన్నీ…
రవితేజకి తగ్గట్టు ఈ సినిమా వుంటుంది. నిజాయితీగా ఉన్న హీరో జీవితంలో ఫన్, రోమాన్స్, లవ్ అన్నీ వుంటాయి. తన ఫైట్‌లో నిజాయితీ వుంటుంది. నిజాయితీ అనే పాయింట్ నుంచే అన్నీ వచ్చాయి.
వన్ వీక్‌లో నాలుగు చార్ట్‌బస్టర్ ట్యూన్స్…
మిస్టర్ బచ్చన్ మ్యూజిక్ అంతా వన్ వీక్‌లో చేశాం. వన్ వీక్‌లో నాలుగు చార్ట్‌బస్టర్ ట్యూన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ గా కొన్ని సార్లు ఫెయిల్ అయినా నా పాటలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. నాకు మొదటి నుంచి పాటలు చాలా ఇష్టం. గద్దల కొండ గణేష్ లో అన్ని పాటలు హిట్టు. మిక్కీ మోస్ట్ అండర్ రేటెడ్ కంపోజర్ అని నా ఫీలింగ్. మా ఇద్దరి కాంబినేషన్ బాగా మ్యాచ్ అయ్యింది.
లవ్ స్టొరీ బ్యూటీఫుల్‌గా...
క్యాసెట్ రికార్డింగ్ సెంటర్స్ వున్న రోజులో జరిగే కథ ఇది. అప్పట్లో బాహాటంగా పోస్టర్లు పెట్టి క్యాసెట్ రికార్డ్ చేసేవారు. ఆ టైంని గుర్తు చేద్దామని లిరికల్ వీడియోలో అమితాబ్, చిరంజీవి పోస్టర్స్ చూపించడం జరిగింది. -నేను బిహెచ్‌ఈల్‌లో పెరిగాను. అక్కడ ఓ మంచి లవ్ స్టొరీ తీయాలని ఎప్పటినుంచో కోరిక. అయితే నాకున్న మాస్ ఇమేజ్ కి తీయడం కుదరలేదు. ఈ సినిమాలో ఆ ప్రేమ కథ కోరిక ఎంతోకొంత తీరింది. ఇందులో లవ్ స్టొరీ బ్యూటీఫుల్‌గా వుంటుంది.
ఆ రెండు బ్యాలెన్స్ చేశాం…
ఎవరూ చూడని బ్యాక్‌డ్రాప్‌లో మనం మర్చిపోయిన జ్ఞాపకాలని గుర్తు చేస్తూ, మనకి గుర్తున్న జ్ఞాపకాల్ని చూపిస్తూ, రవితేజ నుంచి ఏం ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్ తో సినిమాని తీర్చిదిద్దాం. -సెకండ్ హాఫ్‌లో రవితేజ పర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ చాలా కొత్తగా ఫీలతారు. ఐటీ ఆఫీసర్‌కి తగ్గట్టుగా ఆయన తనని మలచుకున్నారు. రవితేజకి సూట్ అయ్యేలా కథని మలుచుకున్నాం. రెండు బ్యాలెన్స్ చేశాం.
అద్భుతంగా నటించింది…
90వ దశకం బ్యాక్‌డ్రాప్‌లో ఒక వీధిలో జిక్కీ అనే అమ్మాయి వుండాలి అన్నప్పుడు.. అ అమ్మాయికి గత సినిమాల ఇమేజ్ ఉండకూడదని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. అద్భుతంగా నటించింది.
హోల్సమ్ ఎంటర్‌టైనర్…
సినిమాలో నాలుగు ఫైట్స్ ఉన్నాయి. -ఈ నాలుగు ఫైట్లే పది ఫైట్లకు సమానంగా ఉంటాయి. రవితేజ సినిమా అంటే మాస్‌తో పాటు ఫ్యామిలీస్ కూడా చూస్తారు. ఈ సినిమా హోల్సమ్ ఎంటర్‌టైనర్. -మిస్టర్ బచ్చన్ సినిమా మళ్ళీ మళ్ళీ చూసేలా వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News