Wednesday, January 22, 2025

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు కె. వాసు హైదరాబాద్ ఫిలింనగర్ లోని తన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాసు కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. చిరంజీవి తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’కు దర్శకత్వం చేసిన వాసు.. కోతల రాయుడు, అమెరికా అల్లుడు, తోడు దొంగలు, పల్లెటూరి పెళ్లాం, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, అల్లుళ్లోస్తున్నారు తదితర చిత్రాలకు డైరెక్షన్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోమవారం నాడు టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మృతిచెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News