Monday, December 23, 2024

కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె విశ్వనాథ్(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్ గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

దర్శకులు కె విశ్వనాథ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా, 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్.. శంకరాభరణం, స్వయం కృషి, స్వాతిముత్యం, స్వర్ణకమలం, సిరివెన్నెల, స్వాతికిరణం, స్వారాభిషేకం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు మొత్తం 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News