Monday, December 23, 2024

మేం వెయిట్‌ చేసినందుకు.. చాలా పెద్ద సక్సెస్‌ వచ్చింది: కార్తీక్‌ దండు

- Advertisement -
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టిక‌ల్‌ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది.

విరూపాక్షతో తనను తాను ప్రూవ్‌ చేసుకున్న దర్శకుడు కార్తీక్‌ దండు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని మెచ్చుకుంటున్నారు. మరి అంత మంచి సినిమా చేసిన కార్తిక్‌ దండు ఏమన్నారు? ఆయన మనసులోని మాటలు మీకోసం….

ఈ సినిమా థాట్‌ మైండ్‌లోకి ఎలా వచ్చింది?
– సినిమాలో దెయ్యం ఉండదు. అలా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఈ జోనర్‌కి చిన్నప్పటి నుంచీ పెద్ద ఫ్యాన్‌. ఈ జోనర్‌లో ఈ మధ్యకాలంలో హారర్‌ కామెడీలు వస్తున్నాయే తప్ప, స్ట్రిక్ట్ హారర్‌ మూవీస్‌ రావడం లేదనిపించింది. అందుకే తీద్దామనిపించి తీశా. 2016, 2017లో ఓ పేపర్‌లో ఆర్టికల్‌ చదివా. గుజరాత్ లో ఓ మహిళ చేతబడి చేస్తుందన్న అనుమానంతో ఓ చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ కథ రాద్దామని. నిజంగా ఆమెకు చేతబడి వచ్చి ఉంటే, వారందరూ చచ్చిపోయేవారేమో అనిపించింది.

సుకుమార్‌ ఈ సినిమా చూసి ఏమన్నారు?
– సుకుమార్‌గారు నిన్న నైట్‌ కాల్‌ చేశారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ప్రౌడ్‌గా ఉన్నారు.

సాయిధరమ్‌తేజ్‌ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి?
– సుకుమార్‌గారి దగ్గరకు వెళ్లడానికి ముందు చాలా చిన్న స్పాన్‌లో అనుకున్నాను. కానీ ఆయన కథ విన్న తర్వాత సాయితేజ్‌, ప్రసాద్‌గారిని ఆయన డిసైడ్‌ చేశారు. అక్కడి నుంచి అందరం కలెక్టివ్‌ డిసిషన్‌ తీసుకున్నాం. నా డ్రాఫ్ట్ అయ్యాక సుకుమార్‌గారి దగ్గరకు వెళ్లాక 6,7 వెర్షన్లు స్క్రీన్‌ప్లేకి చేశాం. కథ మారలేదు కానీ, ట్రీట్‌మెంట్‌ మారుతూ ఉండేది. అన్ని వెర్షన్లు రాసి బెస్ట్ చూజ్‌ చేసుకున్నాం.

నందిని కేరక్టర్‌కి సంయుక్తమీనన్‌ని సెలక్ట్ చేసిందెవరు?
– సంయుక్తని నేనే సెలక్ట్ చేశా. తెలుగుకి ఒకట్రెండు సినిమాల అనుభవం ఉన్న అమ్మాయి అయితే బావుంటుందని అనుకున్నాం. సంయుక్త ఈ కేరక్టర్‌ని బాగా చేస్తారని అనుకున్నాం. రవిని మా ఏడీ సజెస్ట్ చేశాడు. ఆడిషన్‌లో రవి చాలా బాగా చేశాడు. వెంటనే ఓకే చేశాం.

మీ కథలో సుకుమార్‌గారు చేసిన చేంజెస్‌ ఏంటి?
– క్లైమాక్స్ లో ఆడియన్స్ థ్రిల్‌ అయిన విషయాలు సుకుమార్‌గారు చేసిన మార్పులే. హారర్‌ అంటే దెయ్యాలే కాదు. మనకు వెన్నులో చలి పుట్టించేది ప్రతిదీ హారరే. ఆడియన్స్ కి కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో మర్డర్లు కూడా కొత్తగా డిజైన్‌ చేశాం.

ఫస్ట్ టైమ్‌ డైరక్టర్‌ అన్నట్టు కాకుండా, ఎక్స్ పీరియన్డ్స్ గా ఎలా తీశారు?
– కార్తికేయ ఒన్‌లో రాశాను. భమ్‌బోళేనాథ్‌ అని ఓ సినిమా డైరక్ట్ చేశా. కొన్ని రివ్యూస్‌లో డైరక్టర్‌గా నేను ప్రూవ్‌ అయ్యానే తప్ప, కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. 2015-16లో వచ్చింది ఆ సినిమా.

నందిని, విరూపాక్ష, రుద్రవనం… అనే పేర్లు పెట్టడానికి రీజనేంటి?
– శివుడి వాహనం నంది. అందుకే నందిని అని పెట్టాం. రుద్రవనం, విరూపాక్ష కూడా శివుడితాలూకు పేర్లే. చీకటిలో ఉండిపోయిన విలేజ్‌కి వెలుగులా వచ్చాడు అని హీరోకి సూర్య అని పేరు పెట్టా.

కమల్‌కామరాజు ఎపిసోడ్‌లో బ్లాక్‌ మ్యాజిక్‌ని సపోర్ట్ చేశారా?
– నేను సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఒకవేళ అలాంటివి ఉంటే ఏంటి? అనే థాట్‌ నుంచి పుట్టిందే కథ. ఆడియన్స్ ని థ్రిల్‌ చేసి క్యూరియస్‌గా ఉంచాలనే ఈ సినిమా చేశా. చందమామ కథల్లో కనిపించిన థ్రిల్‌ ఉండాలని చేశా.

సాయితేజ్‌కి బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు… మీ థాట్‌ ప్రాసెస్‌ ఎలా ఉంది?
– నా తొలి సినిమా పెద్దగా ఆడలేదు. అందుకే రైటింగ్‌లోనూ, మేకింగ్‌లోనూ నిలబడిపోవాలని అనుకున్నా. 2018వరకు నేను నమ్మిన కథకు అవకాశం రాలేదు. దానికి కారణం, అప్పట్లో నేను కథ రాసుకున్నప్పుడు వేరే బడ్జెట్‌ ఉండేది. అప్పుడు నిర్మాతలు నన్ను నమ్మలేదు. ఆ టైమ్‌లో నన్ను నమ్మింది సుకుమార్‌గారే. డైరక్టర్‌ ప్యాషన్‌, స్కిల్స్ అర్థం చేసుకోగలుగుతారనే నమ్మకం కలిగింది. నా నమ్మకం నిజమైంది. కథ ఆయనకు నచ్చింది. అందుకే స్క్రీన్‌ప్లేని ఆయన కూర్చుని మార్చారు.

మా కథకు నాలుగేళ్లు… కరోనా కూడా బ్రేక్‌ వేసింది. అంతా కంప్లీట్‌ అయి సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాం. ముందురోజు అందరం కలిసి కూర్చున్నాం. అందరం ఫోన్లు సైలెంట్‌లోనో, వైబ్రేషన్‌ మోడలోనో పెట్టాం. షెడ్యూల్ డిస్కస్‌ చేస్తున్నాం. ఒకేసారి అన్ని ఫోన్లు రింగ్‌ అయ్యాయి. సెకన్ల గ్యాప్‌లో అన్నీ మోగుతున్నాయి. ఆఫీస్‌ బోయ్‌ డోర్‌ ఓపెన్‌ చేసుకుని లోపలికి వచ్చి ‘ఒకసారి అర్జెంటుగా టీవీ పెట్టండి’ అని అన్నారు. న్యూస్‌లో హీరోగారికి యాక్సిడెంట్‌ అని వచ్చింది. 22 రోజులు సాయిధరమ్‌తేజ్‌ హాస్పిటల్‌లో ఉన్నారు. నేను ఫిజికల్‌గా తిరుగుతున్నానేగానీ, నేను కూడా కోమాలోనే ఉన్నా.
హాస్పిటల్‌ నుంచి… ఆయన సేఫ్‌గానే ఉన్నారు. త్వరలోనే లేచి తిరుగుతారు అని చెప్పిన తర్వాత రిలీఫ్‌ అయ్యాను. అప్పుడు ఆ టైమ్‌ని మేకింగ్‌లో ఇంకా బెటర్‌గా ఏం చేయొచ్చో అని ఆలోచించి చేశాం. ఫుల్‌ మూవీకి స్టోరీ బోర్డ్ వేసుకున్నాం.

సాయి నుంచి యాక్టింగ్‌ రాబట్టుకోవడం ఎలా అనిపించింది?
– ముందు మూడు రోజులు షెడ్యూల్‌ వేసుకున్నాం. అప్పుడు కాస్త వీక్‌గా ఉన్నారు. చాలా సన్నగా అయ్యారు. 3 రోజులు ఆయన చాలా ఇబ్బందిపడ్డారు. రషెస్‌ చూసుకున్నారు. సెకండ్‌ షెడ్యూల్‌కి ఇంకా 10 రోజులుంది కదా.. . అని స్పీచ్‌ తెరపీ, డ్యాన్సు క్లాసులు అన్నీ చేసుకుని వచ్చారు. సెకండ్‌ షెడ్యూల్‌లో… అంటే, నాలుగో రోజు షూటింగ్‌కి చాలా నార్మల్‌గా వచ్చారు.

లాక్‌ డౌన్‌ వంటి మార్పులు కరోనా వచ్చాక చేశారా? ముందే రాసుకున్నారా?
– ముందే రాసుకున్నా. 2017కి స్క్రిప్ట్ లాక్‌ చేశాం. కరోనాలో ప్రొడ్యూసర్లు, హీరో అందరూ ప్రపంచానికే అష్టదిగ్బంధనం వేశావా అని నాతో సరదాగా అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్‌ జరిగినప్పుడు కూడా అందరూ నాకు ఫోన్లు చేశారు.
కరోనా టైమ్‌లో చాలా ఊళ్లు అష్టదిగ్భందనం చేసుకున్నారు. కరోనా వచ్చాక ఎన్ని బాధలు పడ్డా నాకు హాయిగా అనిపించింది ఏంటంటే, జనాలకు కాస్త ఈజీగా నా కాన్సెప్ట్ అర్థమవుతుంది అన్నదే.

ఈ టైప్‌ జోనర్లకి సెలక్టివ్‌ ఆడియన్స్ ఉంటారు.. అందరికీ రీచ్‌ అవుతామని మీకు అనిపించడానికి కారణమేంటి? మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్‌ ఏంటి?
– హారర్‌ జోనర్‌కి సెలక్టివ్‌ ఆడియన్స్ అనడం కన్నా, వైడ్‌ రేంజ్‌ ఆడియన్సే ఉన్నారు. హారర్‌ సినిమాలను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో లేడీస్‌, పిల్లలు ఎక్కువగా హారర్‌, థ్రిల్లర్‌ ఫిల్మ్స్ ఇష్టపడతారన్నది నా అనుభవంతో తెలుసుకున్న సినిమా. చంద్రముఖిలాంటి సినిమాలు అంత హిట్‌ కావడం అందుకే. మిగిలిన ఎమోషన్స్ ని రియల్‌ లైఫ్‌లో ఇష్టపడతాం. కానీ, హారర్‌ని మాత్రమే మనం స్క్రీన్‌ మీద చూస్తాం. మిగిలిన దేన్నీ మనం రియల్‌ లైఫ్లో చూడం.
సక్సెస్‌ వచ్చాక హీరో రవితేజగారు చాలా బాగా మెచ్చుకున్నారు. కల్యాణ్‌రామ్‌గారు టీజర్‌ వచ్చినప్పటి నుంచే మెచ్చుకుంటున్నారు.

ఈ సినిమా అరుంధతి, చంద్రముఖి మిక్స్ అని అన్నారు. మీరేమంటారు?
– కథా పరంగా కాదు. కానీ, సక్సెస్‌ పరంగా ఆ రెండు సినిమాలకూ మిక్స్ అని నమ్ముతా.

అదర్‌ లాంగ్వేజెస్‌లో ఏమైనా రిలీజ్‌ చేస్తున్నారా?
– కాంతార ఫార్మేట్‌ని ఫాలో అవుతాం. ఇక్కడ మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యాక, మిగిలిన భాషల్లో రిలీజ్‌ చేస్తాం. రెండు వారాల తర్వాత రిలీజ్‌ చేస్తే ఇంకా రీచ్‌ ఎక్కువగా ఉంటుంది. తెలుగు వెర్షన్‌ షోస్‌ బెంగుళూరులో ఇంకా పెరుగుతున్నాయి.

నెక్స్ట్ సినిమా ఏంటి?
– నాకు 2,3 ఐడియాలున్నాయి. ఈ జర్నీలోనే సుకుమార్‌గారూ, నేనూ ఇంకో ఐడియా డిస్కస్‌ చేశాం. ఆయనకు కూడా నచ్చింది. నేను ఏ సినిమా చేసినా, నా స్ట్రెంగ్త్ హారర్‌, థ్రిల్లర్‌.

మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి?
– వైజాగ్‌లో పెరిగాను. నేను ప్లస్‌ టూలో ఉండగా నాన్న చనిపోయారు. అమ్మ పెంచారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా తమ్ముడు కువైట్‌ వెళ్లి నాకు సపోర్ట్ చేశాడు. సుకుమార్‌గారు ఈ సినిమాను ఓకే చేయగానే, మా తమ్ముడు రిజైన్‌ చేసి వచ్చేశాడు.

ఏ నిర్మాత అడ్వాన్స్ ఇచ్చారు? ఎవరు కాల్‌ చేశారు?
ఈ సినిమా చూసి ఇండస్ట్రీ లో దిల్‌రాజుగారి నుంచీ చాలా మంది నిర్మాతలు చేశారు. నేనింకా ఎవరి దగ్గరా అడ్వాన్సులు తీసుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News