Sunday, December 22, 2024

రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా హైకోర్టును డైరెక్టర్ క్రిష్ ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో హైకోర్టులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులు కిత్రం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు క్రిష్ సమాచారం ఇచ్చారు. తనకు మరో రెండు రోజులు సమయం కావాలని క్రిష్ కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. ఇవాళ విచారణకు క్రిష్ హాజర్ పై సస్పెన్స్ కొనసాగుతుంది.  గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.  ఈ నెల 24న రాడిసన్ హోటల్ లో ప్రధాన నిందితుడు వివేకానంద్ డ్రగ్స్ పార్టీ నిర్వహించాడని.. ఈ పార్టీలో సెలబ్రిటీలు శ్వేత, నీల్, లిషి, డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.  డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి కనిపించడంలేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News