Thursday, December 26, 2024

డ్రగ్స్ కేసులో కావాలనే నన్ను ఇరికించారు: దర్శకుడు క్రిష్

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని ప్రముఖ దర్శకుడు క్రిష్ చెప్పారు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారన్నారు. వివేకానంద ఇచ్చిన స్టేట్ మెంట్ తోనే నన్ను నిందితుడుగా చేర్చారు తప్ప తాను డ్రగ్స్ తీసుకున్నాననడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారాయన.

రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణకు రెండు రోజులు గడువు కావాలని, శుక్రవారం హాజరవుతానని క్రిష్ పోలీసులకు చెప్పారు. తీరా శుక్రవారంనాడు ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. క్రిష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News