Wednesday, January 22, 2025

పెళ్లిలోని కష్టాలను ఆసక్తికరంగా చూపించబోతున్నాం

- Advertisement -
- Advertisement -

Director Laxman Interview about 'Swathi Mutyam'

బెల్లంకొండ గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “మన చుట్టూ జరిగే సంఘటనల నుంచే ఈ సినిమా కథ పుట్టింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళు స్పందిస్తారు? పక్కింటి వాళ్ళు ఎలా స్పందిస్తారు? ఎవరి ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయి.

ఇంజనీరింగ్ పూర్తి చేసి చిన్న టౌన్‌లో అప్పుడే జూనియర్ ఇంజనీర్‌గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న ఒక యువకుడి కథే ఈ చిత్రం. జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెడతారు. ఒక సాధారణ పెళ్లిలో కూడా ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం. హీరో గణేష్, నాకు ఇదే మొదటి సినిమా. ఈ సినిమాతో డైరెక్టర్‌గా నేను, హీరోగా తను సక్సెస్ అవుతాడన్న నమ్మకం ఉంది. ‘96’ మూవీ చూసినప్పుడే హీరోయిన్ వర్ష బొల్లమ్మ నచ్చింది. మొదటి సినిమా చేస్తే ఈ అమ్మాయితో చేయాలనుకున్నాను. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే హీరోయిన్ పాత్రకు ఆమెని ఊహించుకునే రాసుకున్నాను. ఆ తర్వాత హీరోయిన్‌గా వర్ష పేరును సూచించగానే ప్రొడక్షన్ హౌస్ కూడా ఒప్పుకోవడం జరిగిపోయాయి”అని అన్నారు.

Director Laxman Interview about ‘Swathi Mutyam’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News