Wednesday, November 13, 2024

చిరంజీవి ఇంటికి పిలిచి అభినందించారు

- Advertisement -
- Advertisement -

రారా కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు పి.మహేశ్ బాబు. తొలి సినిమాతో ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరి రూపొందించి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కొంత విరామం తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి దర్శకుడు పి.మహేశ్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

నా విజన్‌ను నమ్మినందుకు హ్యాపీ…
అనుష్కకు ఈ కథ చెప్పినప్పుడే అక్కడే యూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఆమెకు కథ చెప్పాక ‘మీరు మూవీ ఎవరితో చేయాలని అనుకుంటున్నారు’ అని ప్రొడ్యూసర్స్ అడిగారు. డైలాగ్ వెర్షన్ పూర్తయ్యాక ఆలోచిస్తా అని చెప్పాను. సినిమా కథ, కంటెంట్ మీద నాకున్న ఫోకస్ వారికి తెలిసింది. అనుష్కకు ఈ కథ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకోగా యూవీ నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు. పెద్ద బ్యానర్ నా విజన్‌ను నమ్మినందుకు హ్యాపీగా అనిపించింది.
ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడకుండా…
ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉంటుంది కానీ అడల్ట్ కంటెంట్ కాదు. అనుష్క, నవీన్ లాంటి యాక్టర్స్‌కు ఒక ఇమేజ్, క్రెడిబిలిటీ ఉంటుంది. కంటెంట్ బాగా లేకుంటే అసలు వాళ్లే ఈ సినిమా ఒప్పుకోరు. సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడకుండా సినిమా చూశామని సెన్సార్ వాళ్లు చెప్పారు.

కొత్త అనుభూతినిచ్చే సినిమా…
కొత్త తరహా కథలు చేసేందుకు అనుష్క, నవీన్ లాంటి స్టార్స్ సిద్ధంగా ఉన్నారు కాబట్టే మాలాంటి డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ రాయగలుగుతున్నాం. ఈ సినిమా ఫన్, ఎమోషన్ కలిసి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. సందేశాలు నేరుగా చెప్పడం లేదు. కానీ కథలో ఆ సందేశం ఉంటుంది.
అలా మొదలైన ప్రయాణం ఎక్కడ ముగిసింది…
జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన ఉన్న ఒక అమ్మాయి పెళ్లి కాకుండా తల్లి అవడంలో సంతోషాన్ని కోరుకుంటుంది. అందుకోసం ఒక అబ్బాయి సహాయం తీసుకుంటుంది. ఇలా మొదలైన ప్రయాణం ఎక్కడ ముగిసింది. ఈ క్రమంలో ఆ జంటకు ఎదురైన పరిణామాలు ఏంటి. వాళ్లు మానసికంగా ఎలాంటి ఎమోషన్‌కు గురయ్యారు అనేది ఈ సినిమా స్టోరీలైన్.
చిరంజీవి ఇంటికి పిలిచి అభినందించారు…
చిరంజీవి మా సినిమా చూసి మాకు ఫోన్ చేశారు. నేను ఫోన్‌లోనే సంతోషంలో ఊగిపోయాను. మెగాస్టార్ ఫోన్ చేసి అభినందిస్తే ఎలా ఉంటుంది. నేను రైటర్‌గా కథ రాసేప్పుడు ఈ పాయింట్స్‌ను సినిమా చూసేవాళ్లు గుర్తుంచుకోవాలి అనుకుంటానో, అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా చిరంజీవి మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. చిరంజీవి నన్ను, నవీన్‌ను ఇంటికి పిలిచి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News