బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్ 3’. ఇప్పటి వరకు మరే చిత్రం రూపొందించని రీతిలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న స్పై యూనివర్స్‌లో భాగంగా ‘టైగర్ 3’ మూవీని నిర్మించారు. ఇందులో సల్మాన్ టైటిల్ పాత్రను పోషించారు. సీట్ ఎడ్జ్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రపంచంలోని ప్రముఖ సైన్యాలు యుద్ధ సమయంలో ఉపయోగించే ఆయుధాలను చూపించామని చిత్ర దర్శకుడు మనీష్ శర్మ తెలియజేశారు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించటానికి యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధమైంది.
ఈ సందర్భంగా మనీష్ శర్మ మాట్లాడుతూ ‘‘టైగర్ 3 చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు చాలా యుద్ధ ట్యాంకులను, చాపర్స్, గన్స్, బ్లాస్టిక్ మిస్సైల్స్‌ను ఉపయోగించాం. ప్రేక్షకులకు ఈ ఆయుధాలను చూసేటప్పుడు ఒరిజినల్ ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో ప్రపంచంలోని ప్రముఖ సైన్యాలను ఉపయోగించే ఆయుధాలను ఉపయోగించాం. వీటిని రేపు థియేటర్స్‌లో చూసే ఆడియెన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకుంటారు. టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్ ఉన్నతమైన ఆశయాలతో ప్రత్యర్థులతో పోరాటం చేస్తారు. ఈ సన్నివేశాలను రేపు ఆదివారం థియేటర్స్‌లో చూసేటప్పుడు ఆడియెన్స్‌కు అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌నిస్తాయని భావిస్తున్నాను’’ అన్నారు.
మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన టైగర్ 3 మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. నవంబర్ 12న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. స్పై యూనివర్స్‌లో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ఈ సంస్థ నుంచి ఇప్పుడు టైగర్ 3 రిలీజ్ కానుంది.
- Advertisement -