Saturday, January 11, 2025

గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు

- Advertisement -
- Advertisement -

భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నిర్మాత బన్నీ వాసు మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మారుతి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఎప్పుడూ లేనంత కొత్తగా…
పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కొత్తగా హీరో గోపీచంద్ చాలా స్టైలిష్‌గా ఈ సినిమాలో కనిపిస్తారు. ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని ఆయన కూడా బాగా నమ్మారు. మంచి కథతో తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్‘ చాలా అద్భుతంగా వచ్చింది.
అప్పుడే గొప్ప సినిమా తీయగలుగుతాము…
ఒక వ్యక్తి డైరెక్టర్ కావాలంటే తన టాలెంట్ కంటే ముందు తను ఒక ప్రేక్షకుడు అయితేనే బెస్ట్ సినిమా తీయగలుగుతాడు. నాకు ఈ కమర్షియల్ యాంగిల్‌లో సినిమా చేయడం ఎందుకు వచ్చిందంటే నేను డిస్ట్రిబ్యూషన్ చేయడమే. ప్రేక్షకులు ఏ సినిమాలు చూస్తున్నారు, దేనికి లేచి వెళ్లిపోతున్నారు అనేది తెలుసుకోగలగాలి. అప్పుడే గొప్ప సినిమా తీయగలుగుతాము.
మంచి పాత్రలు ఉన్నాయి...
భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు నాకు చాలా మంచి పేరును తీసుకు వచ్చాయి. దానికి కారణం మంచి కథ, నటీ నటులు, టెక్నిషియన్స్ సెట్ కావడం. మనకు చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్ రాస్తే మిగతా భాషల నటీనటులను తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్‌లాంటి ఆర్టిస్టులు తీసుకోవడానికి కారణం వాళ్లు చేయాల్సిన మంచి పాత్రలు కథలో ఉన్నాయి.
అద్భుతమైన సంగీతం…
దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. సంగీత దర్శకుడు జకేస్ బీజాయ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
తదుపరి చిత్రాలు…
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో చిరంజీవితో సినిమా అనుకున్నాం. ఆయనకు ఒక లైన్ చెప్పగా నచ్చింది. మెగాస్టార్ డేట్స్‌ను బట్టి ఆ సినిమా చేస్తాను. ప్రభాస్ సినిమా కూడా ఆయన స్థాయికి తగినట్లే గ్రాండ్‌గా చేయబోతున్నాను.

Director Maruthi Interview About ‘Pakka Commercial’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News