Monday, January 20, 2025

చిరంజీవితో సినిమా చేయడం నా డ్రీమ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిరంజీవి గారితో సినిమా చేయడం నా డ్రీమ్ అని డైరెక్టర్ మెహర్ రమేష్  అన్నారు.‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. భోళా శంకర్ షూటింగ్ 2021 నవంబర్ 15న మొదలుపెట్టాం.  మొదటి రోజే దాదాపు ఏడు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, భారీ సెట్ లో మెగా లెవల్ సినిమా స్టార్ట్ చేశాం. అన్నయ్య ని డైరెక్ట్ చేయడం ఒక డ్రీమ్. ఇప్పటికీ ఆ డ్రీంలోనే వున్నాను. ఆగస్ట్ 11 ఆ డ్రీం రిలీజ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి అన్నయ్యని, ఆయన సినిమాలని చూస్తూ ఆయన్ని ఇలా చూపించాలని ప్రతి క్షణం తపనపడుతూ ఈ సినిమా తీశాం.

అన్నయ్య ఇచ్చిన ఎనర్జీతో సినిమా మొత్తం అయిపోయింది. అన్నయ్య కూడా చాలా ఎంజాయ్ చేశారు. దర్శకుడి ఏం కావాలో అన్నయ్య కి బాగా తెలుసు. ఇందులో నా ఒక్కడికే దక్కిన అదృష్టం ఏమిటంటే నేను అన్నయ్య కజిన్. చిన్నప్పటినుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆయనతో ‘బావుందిరా’ అనిపించుకున్నాను. ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు. నేను డైరెక్టర్ అయ్యిందే ఈ సినిమా చేయడానికేమో. ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  పాటలు,  ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News