Wednesday, January 22, 2025

దర్శకుడు శంకర్ నిర్మాణంలో హిస్టారికల్ వెబ్ సిరీస్‌లు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో మూడు హిస్టారికల్ వెబ్ సిరీస్‌లు రూపొందనున్నాయి. ఎన్.శంకర్ టీవీ అండ్ ఫిల్ స్టూడియో బ్యానర్‌లో ఇవి తెరకెక్కనున్నాయి. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ.. “తెలంగాణ సాయుధ పోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మొదటి వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుడుతున్నాం. అక్టోబర్ నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలవుతుంది. ఇక మహాత్మ జ్యోతిరావు పూలే అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణల నేపథ్యంలో రెండవ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నాము.

డా.బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి, అట్టడుగు ప్రజలు, అణగారిన వర్గాలకు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, ఆయన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన బాధలు, వ్యక్తి నుండి వ్యవస్థగా తను మారడానికి మధ్య జరిగిన సంఘర్షనణల ఇతివృత్తంగా మూడో వెబ్ సిరీస్ వర్క్ జరుగుతోంది. ఇక మహాత్మ జ్యోతిరావు పూలేతో పాటు డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌ల వెబ్ సిరీస్‌లు వారి బయోగ్రఫీలు కాదు. ఈ మూడు వెబ్ సిరీస్‌లను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News