Wednesday, January 22, 2025

పాఠశాలల పనివేళ్లలో మార్పులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల పనివేళల్లో ప్ర భుత్వం మార్పులు చేసింది. స్కూళ్లు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభించాలని సోమవారం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి నుంచి ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్రాథమిక పాఠశాలలు, ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలలు పనిచేయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. జంట నగరాల పరిధిలో మినహా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాథమిక పాఠశాలల పనివేళలల మార్పు ఉత్తర్వులు ఉపసంహరించాలి -ః టిఎస్ యుటిఎఫ్.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను ఉదయం 9.00 బదులు 9.30 గంటలకు ప్రారంభించటం అశాస్త్రీయమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభిప్రాయ పడింది. పని వేళలు మార్చాలంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు తదితర భాగస్వాముల (స్టేక్ హోల్డర్స్) అభిప్రాయాలను సేకరించి నిర్ణయించాలని సూచించింది. విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన సందర్భంలో ఆ విధంగా చర్చించి నిర్ణయించిన ప్రస్తుత పనివేళలను ఏమాత్రం చర్చ లేకుండానే మార్పు చేయటం విచారకరమని, ఈ మార్పు కొద్దిమంది ఉపాధ్యాయులకు ఉపయోగపడవచ్చునేమో కానీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రభావం చూపుతుందని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ పాఠశాలల పనివేళలల మార్పుపై ఏకపక్షంగా ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News