Monday, December 23, 2024

మహేష్ లుక్స్, సినిమా నెక్ట్స్ లెవెల్‌లో…

- Advertisement -
- Advertisement -

Director Parasuram about Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ను దర్శకుడు పరశురాం అద్భుతంగా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది థియేట్రికల్ ట్రైలర్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పరశురాం మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
క్యారెక్టర్ డిజైన్ కూడా నచ్చి…
‘గీత గోవిందం’ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడే ‘సర్కారు వారి పాట’ ఐడియా వచ్చింది. ‘గీత గోవిందం’ విడుదలైన తర్వాత మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేశాను. ఇక ‘సర్కారు వారి పాట’ కథ ఎంత నచ్చిందో క్యారెక్టర్ డిజైన్ కూడా మహేష్‌కి అంత నచ్చింది.
నెక్స్ లెవెల్‌లో…
ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. మహేష్ బాబు లుక్స్, సినిమా నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. ‘సర్కారు వారి పాట’లో బ్యాంక్ టాపిక్ ఉంటుంది కానీ మహేష్ బ్యాంకు ఉద్యోగి కాదు. అలాగే ఈ కథలో ఒక వ్యక్తి గురించి కానీ వ్యవస్థని ప్రశ్నించడం కానీ ఉండదు. మంచి ఉద్దేశంతో రాసుకున్న కథ ఇది. సరదాగా ఉంటూ చెప్పాల్సింది బలంగా చెప్పే కథ ఇది.
ఆమెది బలమైన పాత్ర…
సినిమాలో లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుంది. లవ్ ట్రాక్ లవ్‌లీ, లైవ్‌లీగా ఉంటుంది. హీరోయిన్ కీర్తి సురేష్‌ది ఇందులో బలమైన పాత్ర. కథలో చాలా కీలకమైన పాత్ర ఆమెది. ఇక హీరోయిన్ పాత్రకి కీర్తి సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. సినిమా చూసిన తర్వాత హీరోయిన్‌గా కీర్తిని ఎందుకు పెట్టుకున్నామో అందరికీ అర్ధమవుతుంది. తన లుక్స్ అద్భుతంగా ఉంటాయి.
చాలా గొప్ప మాటని…
నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం. ఆయన్ని చూస్తే ఒక హీరో ఫీలింగ్ కలుగుతుంది. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే చాలా గొప్ప మాటని సింపుల్‌గా చెప్పేశారు. ‘సర్కారు వారి పాట’లో కూడా అలాంటి ఒక సందర్భం వచ్చింది. మహేష్ ఆ డైలాగు చెప్పారు. నేను కథ చెప్పినపుడే ఈ డైలాగ్ గురించి చెప్పాను. మహేష్ చాలా ఎంజాయ్ చేశారు. ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది.
పాటలన్నీ అద్భుతంగా…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చార్ట్ బస్టర్ ఆల్బం ఇచ్చారు. సౌండ్స్, ట్యూన్స్ కొత్తగా డిజైన్ చేశారు. కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్, మాస్ పాట… అన్నీ స్క్రిప్ట్‌లో ఉన్నవే. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ‘సర్కారు వారి పాట’ కోసం తమన్ యూనిక్ స్టయిల్‌లో వర్క్ చేశారు. ఇక మహేష్ బాబు కూతురు సితార సినిమాలో ఉండదు. ప్రమోషనల్ సాంగ్‌లోనే కనిపిస్తుంది. ఇది తమన్ ఐడియా. మహేష్ బాబుని అడిగితే ఓకే అన్నారు.
తదుపరి చిత్రాలు…
నాగ చైతన్య హీరోగా 14 రీల్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాను.

Director Parasuram about Sarkaru Vaari Paata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News