Thursday, December 26, 2024

ప్రముఖ మలయాళీ దర్శకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ మలయాళీ దర్శకుడు ప్రకాశ్ కోలేరి కన్నుమూశారు. కేరళలోని వాయనాడ్ లో ఆయన  తన ఇంట్లో  చనిపోయి ఉండగా ఇంటి చుట్టుపక్కలవారు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రకాశ్ వయసు 65 సంవత్సరాలు.

‘మిజియితలిల్ కన్నీరుమాయి’ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన ప్రకాశ్, తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు. మురళి, ఆశా జయరామ్ నటించిన ఈ మూవీ 1993లో సంచలన హిట్ సాధించింది. తర్వాత రమేశ్ అరవింద్, సుధాచంద్రన్, ఎంజీ సోమన్, మత్తు, రాజన్ పి దేవ్, టిజి రవిలతో తీసిన ‘అవన్ అనంతపద్మనాభన్’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1999లో ‘వరుణ్ వారతిక్కిల్ల’ మూవీని తెరకెక్కించారు. పద్నాలుగేళ్ల తర్వాత 2013లో ‘పట్టుపుస్తకం’ అనే మూవీని తీశారు. అదే ప్రకాశ్ చివరి సినిమా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News