Friday, December 20, 2024

నా ఫేవరేట్ డైరెక్టర్ అతనే: ప్రశాంత్ నీల్

- Advertisement -
- Advertisement -

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సలార్ చిత్రం తీసి మరో హిట్ సాధించారు. ఈ డైరెక్టర్ ఇటీవల తన ఫేవరేట్ డైరెక్టర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఫేవరేట్ డైరెక్టర్, స్టార్ హీరో ఉపేంద్ర అంటూ చెప్పుకొచ్చారు.

ఉపేంద్ర తెరకెక్కించిన ఎ, ఓం, ష్, ఉపేంద్ర వంటి చిత్రాల స్టోరీ టెల్లింగ్‌కి ప్రపంచంలోనే ఎవరూ సాటిలేరు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యుఐ’కి సంబంధించిన సాంగ్ మార్చ్ 4న రిలీజ్ కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News