Monday, December 23, 2024

ఆ స్టార్ డైరెక్టర్ తో బాలయ్య తనయుడి మూవీ ఫిక్స్..?

- Advertisement -
- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన డైలాగ్స్, ఫైట్లతో మాస్ ఆడియన్స్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇటీవల ‘భగవంత్ కేసరీ’ సినిమాతో అభిమానులను అలరించిన బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ సినిమాతో బిజీగా ఉన్నాడు.తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఓ వార్తా బాలయ్య అభిమానులను ఖుషీ చేస్తోంది. అదేంటంటే.. బాలయ్య తనయుడి సినీ ఇండస్ట్రీ అరంగ్రేటం. ఇదివరకే బాలయ్య, మోక్షజ్ఞ ఎంట్రీ 2024లో ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు బాలయ్య అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తన తనయుడి ఎంట్రీని బాలయ్య.. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ చేతుల్లో పెట్టినట్లు ఓ వార్త సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు ఈ విషయం తెలుసుకుని ఆనందంలో మునిగిపోతున్నారు. పూరి, మోక్షజ్ఞను తెరపై ఎలా చూపిస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటినుంచే లెక్కలేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News