Sunday, January 19, 2025

ప్రమాదం నుంచి బయటపడిన రాజమౌళి కుటుంబం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుటుంబం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా స్కీనింగ్ కోసం జక్కన్న తన భార్యతో కలిసి జపాన్ వెళ్లాడు. జక్కన్న ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చిందని కార్తీకేయ తన ఎక్స్‌లో పోస్టు చేశాడు.  జపాన్‌లోని ఓ భారీ భవనంలో 28వ అంతస్థులో ఉన్నప్పుడు బిల్డింగ్ కొద్దీగా కదిలినట్టుగా అనిపించింది. కొంత సమయం తరువాత అది భూకంపం వల్ల జరిగినట్టు తెలిసి భయపడ్డామని పేర్కొన్నారు. భూకంపం ద్వారా కలిగే అనుభూతిని చెందానని వివరించారు. భూకంపం సంభవిచ్చినప్పుడు స్మార్ట్ వాచ్ లో వార్నింగ్ ఫొటోను స్కీన్‌షాట్ తీసి కార్తీకేయ షేర్ చేశారు. తన హృదయంలో జపాన్‌కు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని భూకంపం సంభవించిన ప్రతిసారి ఆదేశ ప్రజలకు సానుబూతి ప్రకటించారు. జపాన్‌లో భూకంప తీవ్రత 5.3గా ఉందని ఆ దేశపు భూపరిశోధన అధికారులు వెల్లడించారు. జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్‌లో 46 కిలో మీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టుగా గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి జపాన్ ఇప్పటివరకు ప్రకటించలేదు. కొత్త సంవత్సర వేడుకలో అందరూ మునిగి తేలుతుండగా 7.6 తీవ్రతతో భూకంప సంభవించడంతో జపాన్ పశ్చిమ తీరం అల్లకలోలమైంది. భూకంప తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోయారు. ఈ భూకంపంలో సుమారుగా 60 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News