Saturday, January 18, 2025

సూపర్ హిట్ దర్శకుడికి రెండేళ్ల జైలు!

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు. దామిని, ఘాయల్, ఘాతక్ సినమాల డైరెక్టర్ గా ఆయన పేరు చిరపరిచితం. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలుగా ఆయన తాజాగా తెరకెక్కించిన ‘మెర్రీ క్రిస్మస్’ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించింది. అయితే ఇంతటి ప్రముఖ దర్శకుడు ఓ చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నాడు.

జామ్ నగర్ కు చెందిన అశోక్ లాల్ అనే వ్యాపారవేత్తనుంచి గతంలో రాజ్ కుమార్ సంతోషి కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. ఆ డబ్బును తిరిగి చెల్లిస్తూ ఆయన ఇచ్చిన పది చెక్కులూ బౌన్స్ కావడంతో అశోక్ లాల్ కోర్టుకెక్కాడు. దాదాపు పదేళ్లుగా కోర్టులో ఉన్న ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. రాజ్ కుమార్ బాకీ పడిన మొత్తానికి రెట్టింపు డబ్బును అశోక్ లాల్ కు చెల్లించాలని, రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.

ప్రస్తుతం అమీర్ ఖాన్ సొంత సినిమా ‘లాహోర్ 1947’ దర్శకత్వ పనుల్లో బిజీగా ఉన్న రాజ్ కుమార్ సంతోషికి కోర్టు తీర్పు పెద్ద దెబ్బేనని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News